నారా లోకేశ్ క్రికెట్ మ్యాచ్‌లు చూడటానికి వెళ్తే వైసీపీ వాళ్లు ఒక రేంజ్‌లో విమర్శలు చేశారు. మంత్రిగారికి ఆటలెందుకు అని రకరకాల కామెంట్లూ వినిపించాయి. ఇలా పని గట్టుకొని బురదజల్లే బ్యాచ్‌కి తెలియని విషయం ఏంటంటే.. నారా లోకేశ్ పర్సనల్ టూర్‌లోనూ ప్రభుత్వ పనుల్ని చక్కబెడుతున్నారు. కొలంబో క్రికెట్ మ్యాచ్ సందర్భంగా జరిగిన ఒక ఆసక్తికరమైన స్టోరీ గురించి ఇక్కడ చెప్పుకోవాలి. క్రికెట్ మ్యాచ్ కోసం కొలంబో వెళ్లినా.. అక్కడ నారా లోకేశ్.. ఆదిత్య మిట్టల్‌ని కలిశారు. ఈ మీటింగ్‌లో ఆర్సెలర్ మిట్టల్- నిప్పన్ స్టీల్.. ప్రాజెక్టుకి సంబంధించిన పెండింగ్ ఇష్యూల గురించి చర్చ జరిగింది. అన్ని అంశాలపై ఒక అవగాహన కుదరడంతో.. ఈ మీటింగ్ జరిగిన మూడు నెలల్లోనే అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో.. ఏఎంఎన్‌ఎస్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరిగింది. ఇది దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్.
Also Read : అధికారంలోకి వస్తున్నాం.. చెన్నైలో విజయ్ కీలక సమావేశం..!
లోకేశ్ ఏ ఈవెంట్‌కి వెళ్లినా.. అక్కడి ప్రభుత్వానికి చెందిన ముఖ్య నాయకులు అధికారులు.. క్రీడాకారులతో పర్సనల్ రాపో డెవలప్ చేసుకొంటున్నారు. ఈ వ్యక్తిగత సాన్నిహిత్యం.. ఏపీ బ్రాండ్ ఇమేజ్‌కి బూస్ట్ ఇస్తోంది. అదెలాగంటే.. ఈ మధ్య జరిగిన ఆంధ్రా యూనివర్శిటీ వందేళ్ల ఉత్సవాలు చూశారుగా.. ఈ వేడుకలో క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు. సచిన్ పార్టిసిపేషన్‌తో ఆంధ్రా యూనిర్శిటీ ఈవెంట్‌కి ఇంటర్నేషనల్ కవరేజ్ వచ్చింది. ఏపీ బ్రాండ్‌కి అంతర్జాతీయ ప్రమోషన్ లభించింది.
ఏయూ శతాబ్ది ఉత్సవాలకు సచిన్ రావడం వెనుకా.. మంత్రి నారా లోకేశ్ క్రికెట్ డిప్లోమసీ ఉంది. టీమిండియా పోటీలు, ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగే సమయంలో.. సచిన్‌తో లోకేశ్ ఇంటరాక్షన్ పెంచుకున్నారు. సచిన్ కుటుంబంలో జరిగే ముఖ్యమైన వేడుకలకు లోకేశ్‌ని ఆహ్వానించే స్థాయిలో సాన్నిహిత్యం పెరిగింది. ఈ రిలేషన్‌షిప్‌తోనే పిలవగానే కాదనకుండా ఆంధ్రా యూనివర్శిటీ సంబరాలకు సచిన్ అతిథిగా వచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సచిన్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. కేవలం గుడ్‌విల్‌తోనే ఇంత దూరం వచ్చారు.
Also Read : మరో పార్టీ నేతను కలిస్తే.. షోకాజ్, సస్పెన్షన్..!
ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ని ప్రమోట్ చేయడానికి.. మంత్రి నారా లోకేశ్ క్రికెట్‌ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారో ఇప్పుడు అర్ధమైంది కదా.. ప్రజల కోసం చిత్తశుద్ధితో పని చేసే నాయకులు ఏ పని చేసినా.. దాని వెనుక ప్రజా ప్రయోజనం ఖచ్చితంగా ఉంటుంది. ముందు వెనుకా ఆలోచించకుండా.. ఏ పని చేసినా.. ఏదో ఒక కామెంట్ చేయాలని.. వ్యతిరేకిస్తూ విమర్శించాలి.. అనే టార్గెట్‌తో మాట్లాడే వాళ్లకి లోకేశ్ ముందు చూపు అర్ధం కాదు. ఒకవేళ అర్ధమైనా.. వాళ్ల ధోరణిలో మార్పు రాదు. కానీ ప్రజలు అర్ధం చేసుకోవాలి. మన కోసం పని చేస్తున్నది ఎవరు.. మన మీద కోటలు కట్టుకొంటున్నది ఎవరో తప్పకుండా తెలుసుకోవాలి.

