Thursday, April 30, 2026 01:22 PM
Thursday, April 30, 2026 01:22 PM

ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క..!

ఏపీ అభివృద్ధి పథంలో నేడు ఒక సువర్ణ అధ్యాయం మొదలైందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్‌కు భూమిపూజ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. గడిచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్రం అనుభవించిన విధ్వంస పాలనను ప్రజలంతా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలంటేనే పారిశ్రామికవేత్తలు భయపడే దుస్థితి ఉండేదని, కానీ 2024 ఎన్నికల్లో ఐదు కోట్ల మంది ఆంధ్రులు ఎన్డీయే ప్రభుత్వాన్ని గెలిపించి రాష్ట్ర భవిష్యత్తును మార్చుకున్నారని ఆయన పేర్కొన్నారు.

Also Read : కాళేశ్వరంపై పట్టు వదలని రేవంత్.. కీలక సమావేశం..!

వైజాగ్ ముఖచిత్రం నేటి నుంచి పూర్తిగా మారిపోబోతోందని లోకేష్ స్పష్టం చేశారు. కేవలం ఒక ప్రాజెక్టుకు భూమిపూజ చేయడం మాత్రమే కాదు, విశాఖను ప్రపంచ గ్లోబల్ ఐటీ మ్యాప్‌లో అత్యంత శక్తివంతమైన ప్రాంతంగా నిలబెట్టడమే తమ లక్ష్యమని ఆయన వెల్లడించారు. ఇక నుంచి విశాఖను అందరూ డేటా ఏఐ హబ్ అని పిలుచుకోబోతున్నారని, ప్రపంచ ఐటీ రంగంలో ఈ పవిత్ర పట్టణం తనదైన ముద్ర వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. విశాఖ వీధుల్లో ఇకపై “G అంటే గూగుల్” అనే శబ్దం మార్మోగబోతోందని ఆయన ఉత్సాహంగా ప్రకటించారు.

Also Read : మాచర్లలో సంచలనం.. జూలకంటిపై అటాక్..!

గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వెనుక ఉన్న సుదీర్ఘ ప్రయాణాన్ని లోకేష్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 2019 కంటే ముందే చంద్రబాబు నాయకత్వంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మొదటి ప్రస్తావన జరిగిందని, ఆనాడు తీసుకున్న నిర్ణయం నేడు కార్యరూపం దాల్చడం సంతోషకరమని అన్నారు. ఈ భారీ ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతులందరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు సమర్థ నాయకత్వంలో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని, ఈ రోజు వేసిన పునాది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కొత్త చరిత్రకు ఆరంభమని లోకేష్ అభివర్ణించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

చేసిన పాపం.. కార్యకర్తల...

వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా మాజీ ఇన్ఛార్జ్...

పూడి శ్రీహరి.. ల్యాప్...

వైఎస్ జగన్ మాజీ పీఆర్వో పూడి...

బ్రేకింగ్ : టీడీపీ...

తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు...

బీ కేర్ ఫుల్.....

నేతలు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధుల తీరు...

వాంఖడేలో రోహిత్ ఆడతాడా..?...

ఐపీఎల్ 2026 సీజన్‌ లో వరుస...

గుంటూరు – కనిగిరి...

ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రం సహకారంతో రైల్వే ప్రాజెక్టుల...

పోల్స్