Tuesday, April 28, 2026 02:54 PM
Tuesday, April 28, 2026 02:54 PM

మాచర్లలో సంచలనం.. జూలకంటిపై అటాక్..!

మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. గత కొన్నాళ్ళుగా చల్లబడింది అనుకున్న రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. మాచర్ల ఎమ్మెల్యే.. జూలకంటి బ్రహ్మానందరెడ్డిని లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థులు దాడులకు దిగడం సంచలనంగా మారింది. నియోజకవర్గంలోని.. రెంటచింతల మండలంలోని పశర్లపాడు గ్రామంలో నిర్వహించిన తిరునాళ్లకు హాజరై ఎమ్మెల్యే తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Also Read : శేషాచలం కార్చిచ్చు.. రంగంలోకి పవన్ కళ్యాణ్..!

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డగించేందుకు ప్రయత్నించిన వైసీపీ కార్యకర్తలు, బీరు బాటిళ్లను కారుపైకి విసిరారు. ఒక్కసారిగా జరిగిన ఈ దాడితో ఎమ్మెల్యే భద్రతా సిబ్బంది, వాహనంలో ఉన్న వారు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనతో పశర్లపాడు ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే కారుపై బాటిళ్లు పడటంతో ప్రమాదం తప్పినట్లు సమాచారం. దీనితో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొందని, స్థానికులు పెద్ద ఎత్తున చేరుకున్నట్లు తెలుస్తోంది.

Also Read : నిన్న పవన్.. నేడు బాబు.. స్టాండప్ కామెడీ పేరుతొ అవమానం..!

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించిన పోలీసులు, ఘటనా స్థలంలోనే సైదా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ దాడిలో పాల్గొన్న మరికొందరు వైసీపీ కార్యకర్తలు పోలీసులను చూడగానే అక్కడి నుండి పరారయ్యారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పల్నాడు రాజకీయాల్లో గత కొంతకాలంగా సాగుతున్న ఆధిపత్య పోరు ఈ తరహా దాడులకు దారితీస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రజాప్రతినిధిపైనే బహిరంగంగా దాడికి ప్రయత్నించడాన్ని టీడీపీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. నియోజకవర్గంలో శాంతిని నెలకొల్పేందుకు పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పటి వరకు ఒక...

ఏపీ అభివృద్ధి పథంలో నేడు ఒక...

కాళేశ్వరంపై పట్టు వదలని...

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో.. నిర్మించిన...

ముహూర్తం ఖరారు.. మార్పు...

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి...

జన సైనికులను రెచ్చగొడుతున్నారా..?

జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ...

విశాఖలో ఇన్ఫోసిస్ మెగా...

వైజాగ్ ఐటీ రంగానికి మరింత జోష్...

శేషాచలం కార్చిచ్చు.. రంగంలోకి...

తిరుపతి పుణ్యక్షేత్రం సమీపంలోని పవిత్ర శేషాచలం...

పోల్స్