Monday, April 27, 2026 05:06 PM
Monday, April 27, 2026 05:06 PM

మారిన వీసా నిబంధనలు.. భారతయ విద్యార్థులు జాగ్రత్త పడాల్సిందే..!

ఏప్రిల్ 2024 నుండి మే 2026 మధ్య కాలంలో ప్రపంచ విదేశీ విద్యా రంగం ఊహించని మార్పులకు లోనైంది. గతంలో గరిష్ట సంఖ్యలో అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్న దేశాలు, ఇప్పుడు తమ వ్యూహాన్ని మార్చుకున్నాయి. కేవలం విద్యార్థుల సంఖ్య కంటే, తమ దేశ ఆర్థిక వ్యవస్థకు, శ్రామిక శక్తికి నిజంగా దోహదపడగల నైపుణ్యం కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసుకోవడంపైనే ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు దృష్టి పెడుతున్నాయి. 2026 కొత్త వీసా నిబంధనల ప్రకారం ఆర్థిక రుజువు వంటి అవసరాలు గణనీయంగా పెరిగాయి.

Also Read  : అమీర్ ను ఫిదా చేసేసిన సాయి పల్లవి..!

విదేశాలకు వెళ్లే విద్యార్థులు అక్కడ పార్ట్‌ టైమ్ ఉద్యోగాలపై ఆధారపడకుండా, తమ కోర్సు కాలమంతా సొంతంగా జీవన వ్యయాలను భరించగలరని నిరూపించుకోవాలి. జీవన వ్యయాలకు అవసరమైన కనీస నిధుల పరిమితిని కూడా దేశాలు పెంచాయి. దీనివల్ల ఆర్థికంగా పటిష్టమైన ప్రణాళిక ఉన్నవారికే వీసా దక్కే అవకాశం ఉంది. కేవలం అడ్మిషన్ వస్తే సరిపోదు, అభ్యర్థుల నైపుణ్యం కూడా అత్యున్నత స్థాయిలో ఉండాలని దేశాలు కోరుకుంటున్నాయి. ఆంగ్ల భాషా పరీక్షలైన IELTS లేదా PTE లలో గతంలో కంటే ఇప్పుడు అధిక స్కోర్‌ లు అడుగుతున్నాయి.

Also Read: విశాఖ.. పోర్ట్ టూ డేటా సిటీ..!

అలాగే విద్యార్థి ఎంచుకున్న కోర్సు, వారి గత విద్యా నేపథ్యానికి మరియు భవిష్యత్తు వృత్తిపరమైన లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలి. వీసా దరఖాస్తు ప్రక్రియలో ఇప్పుడు అత్యంత కీలకమైన అంశం జెన్యూన్ స్టూడెంట్ వెరిఫికేషన్. వీసా అధికారులు విద్యార్థి ఎంచుకున్న కోర్సులో నిజాయితీని నిశితంగా పరిశీలిస్తున్నారు. విద్యార్థి విద్యా నేపథ్యం మరియు ఎంచుకున్న కోర్సు మధ్య సంబంధం లేకపోయినా, వృత్తిపరమైన ప్రణాళికలో స్పష్టత లోపించినా వెంటనే వీసా రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. భారత విద్యార్థులు వీసా తిరస్కరణలను నివారించడానికి ముందుగానే మేల్కోవాలని నిపుణులు చెప్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

సజ్జల భార్గవ్ కు...

వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్...

ఏపీలో నరకం చూస్తున్న...

ఆంధ్రప్రదేశ్‌ లో కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్...

విశాఖ.. పోర్ట్ టూ...

అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ ఏఐ...

డీజిల్ దందా.. సర్కార్‌కు...

ఆయిల్ కంపెనీలు తాము చేస్తున్న తప్పులను...

కవిత టీఆర్ఎస్‌.. ఏపీలో...

నా శత్రువుకు శత్రువు నా మిత్రుడు...

అయ్యా వడ్డే గారు.....

మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తీరును...

పోల్స్