Monday, April 27, 2026 02:37 PM
Monday, April 27, 2026 02:37 PM

అమీర్ ను ఫిదా చేసేసిన సాయి పల్లవి..!

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ తన కుమారుడు జునైద్ ఖాన్ నటించిన ఏక్ దిన్ చిత్ర మ్యూజికల్ ఈవెంట్‌ లో భావోద్వేగానికి లోనయ్యాడు. ముంబైలో జరిగిన ఏక్ దిన్ కి మెహఫిల్ కార్యక్రమంలో సినిమాలోని కొన్ని దృశ్యాలు మరియు పాటలను చూసిన ఆమిర్, ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. తండ్రి ఎమోషనల్ అవ్వడం చూసి జునైద్, హీరోయిన్ సాయి పల్లవి ఆయనను ఓదార్చడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ హీరోయిన్ సాయి పల్లవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Also Read: డీజిల్ దందా.. సర్కార్‌కు చెడ్డపేరు..!

సాయి పల్లవి ప్రస్తుతం మన దేశంలోనే ఉన్న అత్యుత్తమ హీరోయిన్ లలో ఒకరు అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. ఈ సినిమాలో ఆమె నటన చూసి అందరూ ఆశ్చర్యపోతారని.. ఆమె ఒక అద్భుతమైన నటి మాత్రమే కాదు, అంతకంటే గొప్ప వ్యక్తి అంటూ కొనియాడాడు. సాయి పల్లవి వంటి ప్రతిభావంతురాలితో కలిసి తన కుమారుడు జునైద్ నటించడం చాలా సంతోషంగా ఉందన్నాడు అమీర్ ఖాన్. ఇక జునైద్ ఖాన్ గురించి చెబుతూ.. నేను అతని తండ్రిని కాబట్టి తన నటన గురించి ఎక్కువ చెప్పలేను అంటూ చెప్పుకొచ్చాడు.

Also Read: కమిన్స్ ఈజ్ బ్యాక్.. హైదరాబాద్ ప్లే-ఆఫ్ ఆశలకు కెప్టెన్ బూస్ట్..!

కానీ దర్శకుడు సునీల్ పాండే, సాయి పల్లవి ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారని చెప్పుకొచ్చాడు. జునైద్ కూడా తన శాయశక్తులా ప్రయత్నించాడని ఓ సరదా కామెంట్ చేసాడు. ఈ చిత్రం 2016 నాటి థాయ్ మూవీ ‘వన్ డే’కి రీమేక్‌ గా తెరకెక్కిన ప్యూర్ రొమాంటిక్ డ్రామా. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం ద్వారా సాయి పల్లవి బాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, మే 1, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏపీలో నరకం చూస్తున్న...

ఆంధ్రప్రదేశ్‌ లో కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్...

విశాఖ.. పోర్ట్ టూ...

అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ ఏఐ...

డీజిల్ దందా.. సర్కార్‌కు...

ఆయిల్ కంపెనీలు తాము చేస్తున్న తప్పులను...

కవిత టీఆర్ఎస్‌.. ఏపీలో...

నా శత్రువుకు శత్రువు నా మిత్రుడు...

అయ్యా వడ్డే గారు.....

మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తీరును...

బ్రేకింగ్: జగన్ అండ్...

గత ప్రభుత్వ హయాంలో తనపై అక్రమంగా...

పోల్స్