Saturday, April 25, 2026 08:17 PM
Saturday, April 25, 2026 08:17 PM

సరిహద్దు వంతెన పంచాయతీ..!

ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు చెప్పడంలో వైసీపీ నేతలు దిట్ట. తాము అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతి కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలిగితే.. ఆ విషయం అప్పట్లో రైట్. కానీ ఇప్పుడు అదే తప్పును కూటమి నేతలు సరి చేస్తుంటే.. అది మాత్రం రాంగ్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి కడప జిల్లాలో అన్నమయ్య, పింఛా డ్యామ్ కొట్టుకుపోయాయి. వరదల కారణంగానే డ్యామ్ కొట్టుకుపోయిందని అప్పట్లో వైసీపీ నేతలు కప్పిపుచ్చుకున్నారు. కానీ వాస్తవానికి డ్యామ్‌ రిజర్వాయర్‌లో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరపటం వల్లే డ్యామ్ కొట్టుకుపోయినట్లు అధికారులు నివేదికలు ఇచ్చారు. అయితే ఆ నివేదిక తొక్కిపెట్టి.. కేవలం వరదల కారణంగానే డ్యామ్ కొట్టుకుపోయిందని బుకాయించారు.

Also Read : బ్రేకింగ్; తెలంగాణ రాష్ట్ర సేన.. కవిత షాకింగ్ నిర్ణయం..!

ఇలాంటిదే ఉత్తరాంధ్రలో కూడా చోటు చేసుకుంది. ఆంధ్ర – ఒడిశా సరిహద్దులోని ఇచ్ఛాపురం వద్ద బహుదా నది ప్రవహిస్తుంది. ఈ నదిపై బ్రిటీష్ కాలంలోనే ఓ వంతెన నిర్మించారు. అయితే దాని కాలం చెల్లడంతో కొత్త వంతెన నిర్మించాలని చాలా రోజులుగా డిమాండ్ వినిపిస్తోంది. అయితే సరిహద్దు ప్రాంతం కావడంతో.. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు, నాయకులు మీన మేషాలు లెక్కించారు. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బహుదా నది నుంచి అక్రమంగా ఇసుకను పెద్ద ఎత్తున తరలించారు వైసీపీ నేతలు. అలాగే వంతెన సామర్థ్యానికి మించి వాహనాలు రాకపోకలు సాగించడంతో అది కూలిపోయింది. దీంతో తమ తప్పు బయటపడకుండా కొత్త వంతెన కోసం రూ.20 కోట్లు మంజూరు అంటూ హడావుడి చేశారు. అలాగే తాత్కాలిక దారి ఏర్పాటు చేశారు.

ఈ వంతెన నిర్మాణం కోసం జీవో అయితే జారీ చేశారు కానీ.. ఒక్క రూపాయి కూడా నిధులు మంజూరు చేయలేదు. అయితే నాటి నుంచి ఈ వంతెన కోసం ఇచ్ఛాపురం టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ పోరాడుతూనే ఉన్నారు. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లు పూర్తవుతున్నా కూడా వంతెన నిర్మించలేకపోయిందంటూ ఇప్పుడు వైసీపీ నేతలు కొత్త డ్రామా మొదలుపెట్టారు. ఇచ్చాపురం ప్రజలకు ఘోర అన్యాయం..! అంటూ వంతెన దగ్గర ధర్నాలు చేపట్టారు. ప్రజల కోసం నెలన్నర రోజుల్లోనే వైసీపీ ప్రభుత్వం తాత్కాలిక వంతెన నిర్మించిందని.. కూటమి ప్రభుత్వం మాత్రం ఈ వంతెన నిర్మాణం చెయ్యకపోవడం దుర్మార్గం అంటూ రాజకీయం చేస్తోంది. రోజూ వేలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.. విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణిస్తున్నారని కొత్త డ్రామాకు తెరలేపారు వైసీపీ నేతలు. ఇచ్చాపురం ప్రజలకు న్యాయం చేయాలన్నారు.

Also Read : నాడు, నేడు.. కుర్రాళ్లకు సవాల్ విసురుతున్న కోహ్లీ..!

వైసీపీ నేతల ఆరోపణలకు ప్రభుత్వ విప్, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఘాటుగా బదులిచ్చారు. వైసీపీ అధినేత జగన్ పై నిప్పులు చెరిగారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కళ్లకు కనిపించటం లేదా అని ప్రశ్నించారు. వైసీపీ నాయకుల దుష్ప్రచారంపై మండిపడ్డారు. కూలిన బాహుదా వంతెనపై రాజకీయం చేయడం వైసీపీ దిగజారు డుతనానికి నిదర్శనమన్నారు. వైసీపీ హయాంలో హడావుడి తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. అవినీతి రహిత పాలన అందించడం వల్లే నియోజకవర్గ ప్రజలు మూడుసార్లు పట్టం కట్టారని ఆయన గుర్తుచేశారు. ఎమ్మెల్యేగా గెలిచాక ఒక్క కాంట్రవర్సీలోనైనా ఇరుక్కున్నానని చెప్పగలరా అని సవాల్ చేశారు. ఇటీవల తన మీద వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో హల్చల్ చేయడం దారుణమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వెనక్కు నెట్టేశారని.. అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. వంతెన నిర్మాణానికి ఒడిశా సర్కార్ అనుమతి కావాలనే కనీస విషయం కూడా తెలియదా అని నిలదీశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని.. వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వెనక్కు నెట్టేశారని.. అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. సాధ్యమైనంత త్వరలోనే వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మొత్తానికి సరిహద్దు వంతెన క్రెడిట్ కోసం వైసీపీ నేతలు తెగ పాట్లు పడుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: జగన్ అండ్...

గత ప్రభుత్వ హయాంలో తనపై అక్రమంగా...

జగన్ మెప్పు కోసం...

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, తన దారి...

కల్తీ నెయ్యి కేసు.....

కల్తీ నెయ్యి కుంభకోణంపై సిట్ అధికారులు...

బ్రేకింగ్; తెలంగాణ రాష్ట్ర...

గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరదించుతూ...

మంగ్లీ అండ్ టీమ్...

మంగ్లీ, శివ నాయక్, రామావత్ మధు,...

ఆ వైసీపీ ఎమ్మెల్సీ.....

వైసీపీకి రాజీనామా చేసి, జనసేన తీర్ధం...

పోల్స్