Sunday, June 21, 2026 09:54 AM
Sunday, June 21, 2026 09:54 AM

నాడు, నేడు.. కుర్రాళ్లకు సవాల్ విసురుతున్న కోహ్లీ..!

క్రికెట్ ప్రపంచంలో ఆటగాళ్లు వస్తుంటారు, వెళ్తుంటారు. కానీ కొందరు మాత్రమే చరిత్ర సృష్టిస్తారు. దశాబ్ద కాలం క్రితం అప్పటి యువ ఆటగాళ్లతో పోటీపడి పరుగుల వరద పారించిన విరాట్ కోహ్లీ.. నేడు తన కంటే 10-15 ఏళ్లు చిన్నవారైన నేటి తరం కుర్రాళ్లతోనూ అదే జోరుతో పోటీ పడుతున్నాడు. ఐపీఎల్ తాజా సీజన్‌ లో మళ్ళీ ఆరెంజ్ క్యాప్ రేసులో నిలవడం కోహ్లీ నిలకడకు, అతని పట్టుదలకు నిదర్శనం అంటున్నారు ఫ్యాన్స్. 35 ఏళ్లు దాటినా విరాట్ బ్యాటింగ్‌ లో ఆ పవర్‌, ఆ వేగం ఎక్కడా తగ్గలేదు.

Also Read : బ్రేకింగ్; తెలంగాణ రాష్ట్ర సేన.. కవిత షాకింగ్ నిర్ణయం..!

20 ఏళ్ల కుర్రాడు మైదానంలో ఎంత వేగంగా పరిగెడతాడో.. విరాట్ అంతకంటే వేగంగా రెండు పరుగుల కోసం స్ట్రైక్ రొటేట్ చేస్తున్నాడు. నేటి యువ ఆటగాళ్లు పవర్ హిట్టింగ్‌పై దృష్టి పెడుతుంటే, కోహ్లీ మాత్రం పక్కా క్రికెటింగ్ షాట్స్ ఆడుతున్నాడు. కోహ్లీ విషయంలో ఉండే ఒకే ఒక విమర్శ స్ట్రైక్ రేట్ ఉండదు అని. కానీ అతను నిన్న గుజరాత్ పై ఆడిన ఇన్నింగ్స్ చూస్తే స్ట్రైక్ రేట్ కూడా యువ ఆటగాళ్ళతో పోటీ పడుతోంది. 44 బంతుల్లో 81 పరుగులు చేసాడు. మరోసారి చేజ్ మాస్టర్ అని ప్రూవ్ చేసుకున్నాడు.

Also Read : మంగళగిరిలో ఐపీఎల్ జాతర.. నారా లోకేష్ సంచలన నిర్ణయం..!

కోహ్లీ ఇంత నిలకడగా రాణించడానికి ప్రధాన కారణం ఫిట్‌నెస్ నిబంధనలు. ప్రపంచ క్రికెట్‌లో ఫిట్‌నెస్ అనే పదానికి కొత్త నిర్వచనం ఇచ్చింది విరాట్ అనడంలో అతిశయోక్తి లేదు. గంటల తరబడి జిమ్ వర్కౌట్స్, కఠినమైన ఆహార నియమాలు ఆయన్ని నేటికీ మైదానంలో అత్యంత చురుకైన ఫీల్డర్‌ గా, అలసట లేని బ్యాటర్‌ గా నిలబెట్టాయి. కెరీర్ ప్రారంభంలో గంభీర్, సచిన్, ధోనీ వంటి దిగ్గజాల నీడలో ఎదిగిన విరాట్.. ఆ తర్వాత రోహిత్, ధావన్ వంటి వారితో కలిసి జట్టును నడిపించాడు. ఐపిఎల్ లో గతంలో గేల్, ఊతప్ప, వార్నర్ వంటి వారితో పోటీ పడ్డ కోహ్లీ.. ఇప్పుడు అభిషేక్, గిల్, జైస్వాల్ వంటి నేటి తరం ఆటగాళ్ళతో పోటీ పడుతూ ఆరెంజ్ క్యాప్ రేసులోకి దూసుకురావడం గమనార్హం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

SBI వర్సెస్ తెలంగాణా...

రాయదుర్గం భూముల కేటాయింపు వ్యవహారంలో స్టేట్...

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

పోల్స్