Saturday, April 25, 2026 06:15 PM
Saturday, April 25, 2026 06:15 PM

కల్తీ నెయ్యి కేసు.. దినేష్ రిపోర్ట్ రెడీ..!

కల్తీ నెయ్యి కుంభకోణంపై సిట్ అధికారులు ఇచ్చిన నివేదికపై ఏకసభ్య విచారణ కమిటీ వచ్చే వారం నివేదికను సమర్పించనుంది. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు అసలు దొంగలు దొరకలేదు.. కొసరు దొంగలు మాత్రమే దొరికారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చివరకు తిరుమల శ్రీవారిని కూడా వదలలేదు దుర్మార్గులు. అలాంటి దుర్మార్గులు పట్టుబడతారా..? వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కల్తీ నెయ్యి కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం కలిగింది. టీటీడీ బోర్డు మాజీ చైర్మన్‌లు, బోర్డు మాజీ సభ్యుల ప్రమేయం ఎంతవరకు అనే విషయం ఇప్పటి వరకు బయటపడలేదు. వారికి తెలియకుండా, వందల కోట్లు కుంభకోణం జరిగిందా..?

Also Read : దుర్గగుడిలో అధికారుల పాపాలు.. ఎందుకీ వరుస వివాదాలు..?

అసలు దొంగలను, కావాలని కానీ, ఒత్తిళ్లతో కానీ సిట్ అధికారులు వదిలేశారా.. ప్రభుత్వం క్షమించినా.. తిరుమల శ్రీవారు వదులుతారా.. సరైన సమయంలో, ఎవరెవరిని, ఏ విధంగా ఎప్పుడు తాకాలో, అప్పుడు తాకటం ఖాయం.. అసలు దొంగలను వదిలేయమని, సిట్ అధికారులపై ఒత్తిళ్లు తెచ్చిన రాజకీయ, అధికార పెద్దలను కూడా కర్మ వదలదు. పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి.. వారు చెప్పినట్లుగా అసలు నిందితుల పేర్లను సిట్ అధికారులే నివేదికలో పొందుపరచకపోయినా కర్మ ఫలం వారిని కూడా వదలధు. అసలు నెయ్యే లేకుండా కల్తీ నెయ్యిని తయారు చేసి టీటీడీకి సరఫరా చేసిన కంపెనీల గుట్టు బయటపడిన నేపథ్యంలో.. సుప్రీంకోర్టు ఆదేశాలతో కల్తీ నెయ్యి కుంభకోణంపై విచారణ జరిపిన సిట్ అధికారులిచ్చిన నివేదిక పై చర్యలు తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ విచారణ పూర్తి చేసింది.

వచ్చే వారం ఆ రిపోర్టును సీఎం చంద్రబాబుకు స్వయంగా అందజేయ చేసే అవకాశాలున్నాయి. సుమారు 60 రోజులు సిట్ నివేదికలో అంశాలను ఏకసభ్య కమీషనర్, రిటైర్డు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ పరిశీలించి రిపోర్టు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించబోతున్నారు. సిట్ నివేదికలోని అంశాలపై మాత్రమే, దినేష్ కుమార్ పరిశీలించి, అందుకు బాధ్యులైన వారిలో ఎవ్వరెవ్వరి పై ఏయే చర్యలు తీసుకోవచ్చు అనే విధంగా ఏకసభ్య కమిషన్ నివేదిక సమర్పించే అవకాశం ఉంది. సిట్ అధికారులే సరైన, నిజమైన రిపోర్టు అందజేయలేదని మీడియాలో కథనాలు వచ్చాయి. కల్తీ నెయ్యి కుంభకోణానికి ముఖ్య కారకులైన అప్పటి టీటీడీ బోర్డు చైర్మన్, పర్చేజ్ కమిటీ సభ్యులైన వైసీపీ నేతల హస్తం ఉందని ప్రచారం జరిగినా సుప్రీం కోర్టు ఆదేశాలతో విచారణ జరిపిన సిట్ అధికారులు ఇచ్చిన నివేదికలో అసలు నిందితుల పేర్లు లేవని మీడియా ద్వారా బయటకు పొక్కింది.

Also Read : వైసీపీ నేరగాళ్ల భరోసా పథకం..?

సిట్ అధికారులు ఇచ్చిన నివేదికను పరిశీలించి బాధ్యులైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఏకసభ్య కమిషన్ కమీషనర్ దినేష్ కుమార్ సూచిస్తూ రిపోర్టు తయారు చేసి ఉంటారు. ఆయనిచ్చే నివేదికలో కూడా టీటీడీ బోర్డు మాజీ చైర్మన్, సభ్యులు పేర్లు ఉండకపోవచ్చు అనే మాట వినిపిస్తోంది. సిట్ అధికారులిచ్చిన నివేదికలో వారి పేర్లు లేవని గతంలోనే వెల్లడైంది. తాజాగా దినేష్ కుమార్ ఇవ్వబోతున్న నివేదికలో ఎవరెవరి పై, ఏ చర్యలు తీసుకోవాలో అనే విషయం ఆయన ఇవ్వబోయే నివేదికను బట్టి తెలుస్తుంది. అందుకు కారణం, సిట్ అధికారులు ఇచ్చిన నివేదికలో ఉన్న అధికారులపై ఏ చర్యలు తీసుకోవచ్చు అని మాత్రమే సూచించాలని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల్లో ఉంది. చివరకు సిట్ ఇచ్చిన నివేదిక ఎలా ఉందంటే, ఏనుగు తిన్న వెలగ పండు మాదిరిగా ఉందన్న విమర్శలు వచ్చాయి. ఇక దినేష్ కుమార్ ఇవ్వబోయే నివేదికలో ఏ విధమైన సిఫార్సులు ఉంటాయో వచ్చే వారం ఆయనివ్వనున్న నివేదికలో బయటపడే వరకు వేచి చూడాల్సిందే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: జగన్ అండ్...

గత ప్రభుత్వ హయాంలో తనపై అక్రమంగా...

సరిహద్దు వంతెన పంచాయతీ..!

ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు చెప్పడంలో...

జగన్ మెప్పు కోసం...

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, తన దారి...

బ్రేకింగ్; తెలంగాణ రాష్ట్ర...

గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరదించుతూ...

మంగ్లీ అండ్ టీమ్...

మంగ్లీ, శివ నాయక్, రామావత్ మధు,...

ఆ వైసీపీ ఎమ్మెల్సీ.....

వైసీపీకి రాజీనామా చేసి, జనసేన తీర్ధం...

పోల్స్