సాధారణంగా రాజకీయ పార్టీలు నేరాలు చేసిన వాళ్ళను బ్యాక్ ఎండ్ లో ఉంచి రాజకీయం చేస్తూ ఉంటాయి. అనవసరంగా రాజకీయ ప్రత్యర్ధులకు అవకాశం ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో పని చేస్తూ ఉంటాయి. కానీ వైసీపీ మాత్రం నేరగాళ్లకు మద్దతు ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సొంత డ్రైవర్ ను చంపి, మృతదేహాన్ని వారి ఇంటి ముందే డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుకు మద్దతుగా వైసీపీ శ్రేణులు చేస్తున్న హడావుడి చూస్తుంటే.. ఇది రాజకీయ పార్టీనా లేక క్రైమ్ సిండికేటా..? అంటూ పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : అసలు బాబుకు లేని నొప్పి నీకెందుకు..?
ఒక ప్రాణాన్ని తీసి, కనికరం లేకుండా శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించిన వ్యక్తి కోసం పార్టీ మొత్తం కదిలి రావడం ఏ సంకేతాలను ఇస్తోంది..? అనే ప్రశ్నలు వినపడుతున్నాయి. మీరు ఏ అరాచకం చేసినా, ఏ హత్య చేసినా.. పార్టీ మీకు కొండంత అండగా ఉంటుంది అని కేడర్ కు అధిష్టానం ఓపెన్ సిగ్నల్ ఇవ్వడమే దీని లక్ష్యంగా కనపడుతోందనే మాట వినపడుతోంది. వైసీపీ క్రైమ్ ఇన్సూరెన్స్ పథకం అంటూ విమర్శలు వస్తున్నా.. వైసీపీ మాత్రం వెనక్కు తగ్గడం లేదు.
Also Read : మంగ్లీ అండ్ టీమ్ చేసిన స్కామ్ ఏమిటీ..?
హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని కాపాడాలని దేవాలయాల్లో పూజలు చేయడం, బైక్ ర్యాలీలు నిర్వహించడం వైసీపీకి మాత్రమే సాధ్యమైన రాజకీయ వింత అంటూ పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయమని దేవుడిని అడగాల్సింది పోయి, నేరస్తుడిని విడిపించాలని కోరడం మరో షాకింగ్ విషయం. అనంతబాబు అన్నకు తోడుగా అనే స్లోగన్ కూడా వైసీపీ ప్రకటించడం గమనార్హం. ఇప్పటికే రెచ్చిపోతున్న క్యాడర్ కు ఇది మరింత బూస్ట్ ఇవ్వడం ఖాయమే మాట వినపడుతోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అనంత బాబును కాపాడిన సంగతి తెలిసిందే.

