ప్రభుత్వ ఉద్యోగులు నిబంధనలకు అనుకూలంగా పని చేయాలి. అలాగే సమాజంలో ప్రతి ఒక్కరికీ కొన్ని కట్టుబాట్లు, నియమాలు ఉంటాయి. వాటి పరిధి దాటి వ్యవహరించడం కొన్నిసార్లు అత్యంత ప్రమాదం కూడా. ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘాల మాజీ నేత వెంకట్రామిరెడ్డి వ్యవహరించిన తీరే ఇందుకు ఒక ఉదాహరణ. ప్రభుత్వ ఉద్యోగిగా.. ప్రజల సొమ్ము జీతం రూపంలో తీసుకుంటూ.. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన ఈ వెంకట్రామిరెడ్డి.. తన కులం కానీ కులపోడి భజన చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. దీంతో ప్రభుత్వం శాఖాపరమైన చర్యలు తీసుకుంది. ఏకంగా ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే ఈ వ్యవహారం ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగులే. కిందిస్థాయి బంట్రోతు అయినా సరే.. ఐపీఎస్ అధికారి అయినా సరే. ఆలయంలో అర్చకులైనా సరే.. చర్చిలో పాస్టర్ అయినా సరే.. రూల్స్ దాటి ప్రవర్తించకూడదు. హిందూ శాస్త్రంలో కొన్ని స్పష్టమైన నియమాలున్నాయి. సముద్రాలు దాటి విదేశాలకు వెళ్లిన అర్చకులు ఆలయ గర్భాలయాల్లో పూజలు నిర్వహించడంపై ఏపీ హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ పరిధిలోని దేవస్థానాల ప్రధాన గర్భాలయాల్లో పూజాదికాలు నిర్వహించడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది. ప్రతి అర్చకులు, వేద పండితులు తప్పనిసరిగా సనాతన ధర్మం, ఆగమ శాస్త్ర నిబంధనలను పాటించాలని కూడా హైకోర్టు స్పష్టం చేసింది.
Also Read : నయా రథసారధి.. ముహూర్తం ఫిక్స్..!
అయితే తాజాగా కొందరు అర్చకులు రెండు రోజుల క్రితం చేసిన ఓవర్ యాక్షన్ ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలకు దారి తీస్తోంది. హిందూ ధర్మం పట్ల ఏ మాత్రం విశ్వాసం లేని వ్యక్తి, అసలు హిందూ దేవుళ్లకు కనీస గుర్తింపు లేని కుటుంబం ఏదీ అంటే.. అది వైఎస్ కుటుంబం అని ఠక్కున జవాబు చెప్తారు. ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన వైఎస్ తండ్రీ కొడుకులు కోట్లాది హిందువులు భక్తితో కొలిచే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి కనీసం ఒక్కసారి కూడా సతీసమేతంగా వెళ్లలేదు. ఏకంగా తిరుమల ఆలయంలోని రంగనాయక మండపంలో వేద ఆశీర్వచనం అనంతరం జగన్ రక్షకా.. అంటూ ఆయన సొంత పిన్ని, వైవీ సుబ్బారెడ్డి సతీమణి నినాదాలు చేశారంటే.. దేవుళ్ల పట్ల వారికున్న నమ్మకం ఏమిటో ఇట్టే అర్థమవుతుంది. హిందువుల ఓట్ల కోసమే సరిగ్గా ఎన్నికలకు నాలుగు నెలల ముందు సంక్రాంతి పండుగకు తాడేపల్లి ప్యాలెస్‌లో తిరుమల తరహా ఆలయ సెట్ వేశారంటే.. వారు ఎలాంటి వాళ్లో.. హిందూత్వం మీద వారికి ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యమంత్రి పదవి కోసం, రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి.. హిందువుల ఓట్లు కావాలి కాబట్టి గుడి, ప్రసాదం, పూజలు అంటూ పైకి కనిపిస్తారనే మాట కంటే.. నటిస్తారనే మాట ఇంకా బాగుంటుంది. దేవుడి ప్రసాదం తినడు, ప్రదక్షిణ చేయమంటే.. వద్దు అని ముఖానే చెప్పేస్తాడు.. దంపతులుగా ఏ ఒక్క ఆలయానికి వెళ్లలేదు. అర్చకులు అక్షతలు తలపైన వేస్తే.. వెంటనే దులిపేసుకుంటాడు. స్వామి వారి తీర్థం ఇస్తే.. వాసన చూసి పక్కన పారేస్తాడు తప్ప.. నోట్లో వేసుకోడు.. అలాంటి జగన్ మోహన్ రెడ్డితో కొందరు అర్చకులు వ్యవహరించిన తీరు ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
Also Read : పిఠాపురంలో రగులుతున్న కూటమి, వర్మ సంచలన ట్వీట్..!
వైఎస్ కుటుంబం అంటే.. కన్వర్టెడ్ క్రిస్టియన్ కుటుంబం అనేది అందరికీ తెలుసు. అంటే మతం మారిన క్రైస్తవులు. అంటే పుట్టుకతో కాకుండా, జీవితంలో తర్వాత క్రైస్తవ మతాన్ని విశ్వాసంతో స్వీకరించిన కుటుంబం. వీరు వ్యక్తిగత కారణాల కోసం మాత్రమే మతం మారినట్లు ఇప్పటికీ చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు. వైఎస్ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ క్రైస్తవ మతాన్ని అనుసరిస్తారు. కానీ ప్రతి ఒక్కరి పేరులో మాత్రం రెడ్డి అని తప్పనిసరిగా ఉంచుకుంటారు. ఎందుకిలా అంటే.. హిందువులు, రెడ్డి సామాజిక వర్గం ఓట్ల కోసమే అంటారు రాజకీయ విశ్లేషకులు. అలాంటి జగన్‌ను కొందరు అర్చకులు హిందువుగా చూపించేందుకు నానా పాట్లు పడుతున్నారనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
సరిగ్గా రెండు రోజుల క్రితం పులివెందుల పర్యటనకు బెంగళూరు నుంచి వచ్చిన వైఎస్ జగన్ దగ్గరకు ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం వేద పండితులు పనిగట్టుకుని మరీ వెళ్లారు. మాజీ ముఖ్యమంత్రి, ఓ పార్టీ అధినేత కాబట్టి ఏదో వినతి పత్రం ఇవ్వడానికేమో అనుకుంటే పొరపాటు. వాళ్లంతా అక్కడికి వెళ్లింది పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆశీర్వదించడానికి. అది కూడా ఎప్పుడో 22 రోజుల క్రితం జరిగిన కల్యాణ మహోత్సవానికి రాలేకపోయారని బాధపడిన అర్చకులు.. స్వామి వారి ముత్యాల తలంబ్రాలు, శేషవస్త్రం, పూలమాల అందజేసి మరీ ఆశీర్వదించారు. ఏప్రిల్ ఒకటిన జరిగిన కల్యాణ మహోత్సవానికి జగన్‌ను కూడా ఆహ్వానించారు ఆలయ అధికారులు. కానీ ఆలయాలకు వచ్చేంత తీరిక లేని జగన్ దంపతులు.. ఆ వేడుకకు దూరంగా ఉన్నారు. అయినా సరే.. 20 రోజుల తర్వాత ఆలయ వేద పండితులు మాత్రం.. ఒక ఎమ్మెల్యే ఇంటికి స్వయంగా వెళ్లారు. హిందూ దేవుళ్లంటే కనీస నమ్మకం కూడా లేని జగన్‌ను ఆశీర్వదించారు. ఈ తతంగం అంతా ఉమ్మడి కడప జిల్లా అర్చక, పురోహిత సమాఖ్య అధ్యక్షుడు విజయ్ భట్టార్ ఆధ్వర్యంలో జరిగింది.
Also Read : అనకాపల్లిలో రీన్యూ భారీ సోలార్ ప్రాజెక్ట్: బాబు చేతుల మీదుగా రేపే శంకుస్థాపన
వేద పండితుల తీరుపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజానికి వైఎస్ జగన్ ప్రస్తుతం ఒక ఎమ్మెల్యే మాత్రమే. వైసీపీ 2024 ఎన్నికల్లో 11 స్థానాలు మాత్రమే గెలవడంతో జగన్‍కు ప్రతిపక్షనేతగా స్పీకర్ గుర్తింపు ఇవ్వలేదు. కానీ జగన్ మాత్రం.. తనకు ప్రతిపక్ష హోదా కావాలని కోర్టులో పిటీషన్ల మీద పిటీషన్లు వేస్తున్నారు. అంటే ప్రస్తుతం ఆయన ఒక ఎమ్మెల్యే. క్యాబినెట్ హోదా లేదు. మరి ఎలాంటి హోదా లేని జగన్ ఇంటికి వెళ్లి మరీ ఆశీర్వచనం ఇవ్వాల్సిన అవసరం ఏమిటీ అనేది కీలకం. ఎవరి మెప్పు కోసం.. జగన్ హిందువు అని ప్రజలపై రుద్దేందుకే ఇలా చేశారా.. అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. పులివెందుల పర్యటనలో జగన్‌కు వేద పండితుల ఆశీర్వచనం అంటూ వైసీపీ అధికారిక పత్రిక సాక్షిలో తాటికాయంత అక్షరాలతో రాశారు. ఇక వైసీపీ సోషల్ మీడియాలో కూడా ఫోటో పోస్ట్ చేశారు. అంటే జగన్ హిందువు.. జగన్ క్రిస్టియన్ కాదు.. జగన్ పైన తప్పుడు ప్రచారం జరుగుతోంది అని ప్రజలకు కల్లబొల్లి కబుర్లు చెప్పేందుకేనా.. ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. వేద పండితులపై దేవాదాయ శాఖ విచారణకు ఆదేశించాలి. ఒక ఎమ్మెల్యేకు 20 రోజుల తర్వాత ఇలా ఎందుకు చేశారో.. ఈ కుట్ర వెనుక అసలు సూత్రధారులు ఎవరో బయటకు రావాలి.. అనేది ఇప్పుడు హిందూ ధార్మిక సంస్థల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

