Thursday, April 23, 2026 03:38 PM
Thursday, April 23, 2026 03:38 PM

పిఠాపురంలోనే ఎందుకు ఆ సమస్య..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ ఒక్క నియోజకవర్గంలోనే ఎందుకు సమస్యలు వస్తున్నాయి. ఎక్కడా లేని ఆధిపత్య పోరు.. పిఠాపురం నియోజకవర్గంలో మాత్రమే ఎందుకు..? పిఠాపురం కూటమి నేతల మధ్య గొడవలను టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ సృష్టిస్తున్నారా..? నిన్న మళ్లీ రాదు.. రేపు మనది కాదు.. నేడే నిజం అనే విషయాన్ని, అపార రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నాయకులే గ్రహించలేక పోతున్నారంటే వాళ్లను ఏమనాలి..? కాలం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదని తెలిసి కూడా.. పిచ్చిగా వ్యవహరించే వారిని ఏమనాలి..? అధికారం అండ పోగొట్టుకుంటే ఇప్పుడు పలకరించే వారే.. అప్పుడు కనీసం పట్టించుకోరన్న విషయం గ్రహించక పోతే ఎలా..?

Also Read : మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూత

పొటెలు కొండను “ఢీ” కొట్టినట్లు ఉంటుంది.. అంటే తల పగల కొట్టుకోవాల్సి వస్తుంది.. అప్పుడు కళ్లకు కన్పించేది ధారగా కారుతున్న నెత్తురే.. ఇంతకు అసలు గొడవేమిటంటే, చంద్రబాబు ఫొటో లేదని.. ఫొటో లేనంత మాత్రాన చంద్రబాబు గారి విలువ తగ్గుతుందా వర్మ గారూ..? అసలు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు. ఒకప్పుడు అత్యధిక మెజారిటీతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించానన్న ధీమా వర్మలో ఇంకా ఉందేమో..? అదే వర్మ 2019 ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారు..? అప్పుడు పరిస్థితులు వేరు.. ఇప్పుడు పరిస్థితులు వేరు.. అప్పుడు కులం ప్రభావాలు ఎక్కువగా లేవు. కానీ ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో కులం, ధనం, మతం ప్రభావాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పిఠాపురంలో వర్మ మద్దతు ఉన్నా, లేకున్నా.. పవన్ కళ్యాణ్ గెలుపు ఆపటం చాలా కష్టం.

కులంతో పాటు అభివృద్ధి, అభిమానులు.. ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు, అభిమానుల అండదండలు పవన్ కళ్యాణ్‌కు ఇప్పుడు పుష్కలంగా ఉన్నాయి. వర్మను వదులుకునేందుకైనా సరే చంద్రబాబు వెనుకాడరేమో కానీ.. పవన్ కళ్యాణ్‌ను మాత్రం వదులుకోవటం అసంభవం. ఆయన వల్లే సీఎం అయ్యాననే నమ్మకం, పవన్ వల్లే మళ్లీ అధికారంలోకి వస్తామనే నమ్మకం చంద్రబాబుకు ఉంది. మరో 15 ఏళ్లు కలిసి ఉంటామని, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం చంద్రబాబు సీఎంగా ఉంటారంటున్నారు పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు ఎందుకు వదులుకుంటారు..? ఈ విషయం వర్మకు తెలియకుండా ఉంటుందా..? ఏదో ఒకటి చేసి తన ఉనికి కాపాడుకునేందుకు వర్మ అప్పుడప్పుడు ఏదో ఒక హడావుడి చేస్తున్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది.

Also Read : పిఠాపురంలో రగులుతున్న కూటమి, వర్మ సంచలన ట్వీట్..!

చంద్రబాబు నాయుడు పై పవన్ కళ్యాణ్‌కు అపార గౌరవం ఉంది. అనేక సార్లు బహిరంగంగానే చంద్రబాబుపై పవన్ పొగడ్తల వర్షం కురిపించారు. కానీ పవన్ కళ్యాణ్ లేని సమావేశాల్లో ఏదో కుంటిసాకు చెప్పి ప్రతిసారి వర్మ గొడవ చేస్తుంటే ఎందుకు ఆయనను నిరోధించటం లేదు..? జనసేన నాయకులు ఇతర నియోజకవర్గాల్లో ఇలాగే గొడవ చేయటం మొదలుపెడితే ఏంటి పరిస్థితి..? కుప్పం, మంగళగిరి, హిందూపురం నియోజకవర్గాల్లో జనసేన నాయకులు చూపిస్తున్న విచక్షణా గౌరవం పిఠాపురం టీడీపీ నాయకులు ఎందుకు చూపించలేకపోతున్నారు..? సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్,
పొత్తు ధర్మం పై పవన్ కళ్యాణ్ చూపిస్తున్న విచక్షణ, బాధ్యత, గౌరవం వర్మ కూడా చూపిస్తారని ఆశిస్తున్నామని జనసేన నేతలు కోరుకుంటున్నారు కూడా.

సాక్షి పత్రికకు మేత ఇస్తున్న వర్మ.. వైసీపీకి అమ్ముడుపోయారా..? అనే అనుమానం కలుగుతోంది.. అనిపిస్తుంది కూడా. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ. దొరబాబు జనసేనలో చేరడం.. వంగా గీత కాకినాడ వెళ్లిపోవడంతో అక్కడ సరైన నాయకుడే వైసీపీకి కరువయ్యాడు. అందుకే వచ్చే ఎన్నికల్లో వైసీపీ సీటు కోసం వర్మ ఈ డ్రామాలు ఆడుతున్నారని పిఠాపురం ప్రజల అభిప్రాయం, నమ్మకం కూడా. కాబట్టి వర్మ డ్రామాలకు, చంద్రబాబు వెంటనే అడ్డుకట్ట వేయకుంటే టీడీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ముసలం ప్రారంభం కావటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: ఒంటిమిట్ట అర్చకులకు...

కడప జిల్లా ఒంటిమిట్టలోని ప్రసిద్ధ శ్రీ...

అజ్ఞాతంలోకి అనంతబాబు బిగుస్తున్న...

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా...

మాజీ సీఎం నాదెండ్ల...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నాదెండ్ల...

నయా రథసారధి.. ముహూర్తం...

ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్న టీడీపీలో...

ఈరోజు రాశి ఫలితాలు...

శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం,...

మహానాడు వేదిక ఖరారు.....

తెలుగుదేశం పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకమైంది మహానాడు....

పోల్స్