Tuesday, April 21, 2026 05:09 PM
Tuesday, April 21, 2026 05:09 PM

బర్త్ డే గిఫ్ట్ అదిరింది కదా చంద్రయ్యా..!

వైసీపీ అనుకూల ప్రభుత్వ ఉద్యోగి వెంకట్రామిరెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు పుట్టిన రోజు కానుక అదిరింది. ఉద్యోగ సంఘాల నాయకుడు ఎలా ఉండాలనే విషయం పక్కన పెడితే.. వెంకట్రామిరెడ్డి మాదిరిగా మాత్రం అస్సలు ఉండకూడదు. సచివాలయం ఉద్యోగ సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డికి ఆయన ఊహించని కానుక చంద్రబాబు పుట్టిన రోజున లభించింది. కాకర్ల వెంకట్రామిరెడ్డిని సర్వీస్ నుండి తెలిగిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పూర్తిగా కోల్పోయారు.

సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన వెంకట్రామిరెడ్డి.. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా తనకు తానే ప్రకటించుకున్నారు ఈ జగన్ అభిమాన ప్రభుత్వ ఉద్యోగి. చంద్రబాబుపైన విమర్శలు, ఆరోపణలు చేసిన వెంకట్రామిరెడ్డికి సరైన న్యాయం ఇప్పుడు జరిగిందని కూటమి ప్రభుత్వ అభిమాన ఉద్యోగులే వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వెంకట్రామిరెడ్డి తప్పులు చేశారని.. ఆయన చేసిన తప్పులకు ఇప్పుడు డిస్మిస్ రూపంలో కానుక అందినట్లు సచివాలయ ఉద్యోగులు కొందరు సంబరాలు జరుపుకుంటున్నారు.

Also Read : అమెరికాలో ఇరాన్ మహిళ అరెస్ట్.. సంచలన విషయాలు వెలుగులోకి..!

సచివాలయంలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న వెంకట్రామిరెడ్డి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వల్లమాలిన ప్రేమ, అభిమానం ఒలకబోశారు. చివరికి తానొక ప్రభుత్వ ఉద్యోగి అనే విషయం కూడా మర్చిపోయిన వెంకట్రామిరెడ్డి.. నాటి వైసీపీ ప్రభుత్వానికి మాత్రమే ఓటు వేయాలని ఎన్నికల్లో బహిరంగంగానే ప్రచారం చేసిన సందర్భాలున్నాయి. అలాగే 2014-19 మధ్య ఉన్న చంద్రబాబు ప్రభుత్వాన్ని పదే పదే దూషిస్తూ.. “జగన్ మోహన్ రెడ్డి మాత్రమే ఉద్యోగులకు దేవుడు” అనే అర్థం వచ్చేలా కీర్తనలు, స్తోత్రాలు స్తుతించారు. చివరికి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వెంకట్రామిరెడ్డి నోటి దూల తీరలేదు. పదే పదే టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు కూడా.

వెంకట్రామిరెడ్డి తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన కూటమి ప్రభుత్వం.. ఆయనను తొలుత సస్పెండ్ చేసి.. శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎన్నికల్లో బహిరంగంగానే ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు రుజువు కావడంతో.. ఇప్పుడు శాశ్వతంగా సర్వీస్ నుండి డిస్మిస్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నోరు ఉంది కదా అని.. నోటికొచ్చినట్లు కామెంట్లు చేస్తే దాని పరిణామాలు ఇలానే ఉంటాయనేందుకు వెంకట్రామిరెడ్డి ఉదంతమే ఉదాహరణ. కులం పిచ్చే ఆయన కొంప నిలువునా ముంచిందనే మాట సచివాలయ ఉద్యోగులు బాహాటంగానే అంటున్నారు.

Also Read : పెయిడ్ ఆర్టిస్ట్ కోసం జగన్ ఆరాటం

ఇక ఉన్న అడ్డంకి తొలగిపోవడంతో.. రేపో, మాపో ఈ వెంకట్రామిరెడ్డి అతన అభిమాన నాయకుడు జగన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరినా ఆశ్చర్య పడనక్కరలేదంటున్నారు. వెంకట్రామిరెడ్డి లాంటి మనస్తత్వం ఉన్న ఏ అధికారి.. మళ్లీ సచివాలయం ఉద్యోగ సంఘం అధ్యక్షుడిగా ఎన్నిక కాకూడదని ఉద్యోగులే వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే వెంకట్రామిరెడ్డిని సచివాలయం కింది స్థాయి అధికారులే.. ఒకసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెండోసారి ఓట్లేసి మరీ గెలిపించారు. మామూలు ఓటర్లే ప్రలోభాలకు దిగజారుతున్నారన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో వెంకట్రామిరెడ్డి విషయంలో కొంతమంది సచివాలయం అధికారులు కూడా స్వార్థపరులుగా, నాటి ప్రభుత్వ పెద్దలకు దాసులుగా, అవకాశవాదులుగా మారటం వల్లే రెండోసారి వెంకట్రామిరెడ్డి ఉద్యోగ సంఘ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడనేది బహిరంగ రహస్యం.

అదే సమయంలో కొందరు సచివాలయం అధికారులు, వెంకట్రామిరెడ్డికి వ్యతిరేకంగా పోరాడారన్నది కూడా రెట్టింపు వాస్తవం. మరొక నిజమేమిటంటే.. 2024 ఎన్నికలకు ముందు జగన్ మోహన్ రెడ్డి మళ్లీ సీఎం అవ్వటం ఖాయం అని వెంకట్రామిరెడ్డి బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. కానీ వెంకట్రామిరెడ్డికి వ్యతిరేకంగా కూటమి గెలుస్తుందనే మాట కనీసం ఒక్క ఉద్యోగి కూడా బయటకు చెప్పలేదు. అంటే మనసులో అభిమానం ఉన్నా కూడా.. దానిని వెంకట్రామిరెడ్డి మాదిరాగ బయటపెట్టేందుకు కూడా వెనకడుగు వేశారంటే.. నాటి ప్రభుత్వ పెద్దలు ఎంతగా భయపెట్టారో.. నాటి ప్రభుత్వం అంటే ఎంతగా భయపడ్డారో ఇట్లే అర్థం అవుతుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

జనసేన వర్సెస్ టీడీపీ.....

డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం...

సీఎం చంద్రబాబుకు మంత్రి...

తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్.. ఏపీ...

ఏపీలో విచిత్రం.. నేతల...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సాధారణంగా అధికార, ప్రతిపక్ష...

పెయిడ్ ఆర్టిస్ట్ కోసం...

ఇద్దరు ముఖ్యమంత్రులను దూషించిన వ్యక్తి పై...

విజయ్‌ ఆస్తుల పంచాయితీ.....

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ టీవీకే...

బీఆర్ఎస్‌లో ముసలం.. హరీష్...

గులాబీ పార్టీలో ముసలం మొదలైందా..? జీవన్...

పోల్స్