Monday, August 3, 2026 10:41 PM
Monday, August 3, 2026 10:41 PM

ఏపీలో విచిత్రం.. నేతల మధ్య ఆప్యాయతలు..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సాధారణంగా అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయిలో ఉంటుంది. కానీ, రెండు రోజులుగా ఈ పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియా వేదికగా చోటు చేసుకున్న కొన్ని ఆసక్తికర పరిణామాలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. నిత్యం ఉప్పు-నిప్పులా తలపడే నేతలు ఒకరిపై ఒకరు ఆప్యాయత చాటుకోవడం చర్చనీయాంశమైంది. అటు రాజకీయ వర్గాల్లో, ఇటు తెలుగు ప్రజల్లో కూడా ఇప్పుడు ఇదే చర్చ ఆసక్తికరంగా సాగుతోంది.

Also Read : పెయిడ్ ఆర్టిస్ట్ కోసం జగన్ ఆరాటం

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. కానీ ఏపీలో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించటం లేదు. ప్రధాన రాజకీయ పార్టీల నేతలంతా బద్ధశత్రువుల్లా మారిపోయారు. రాజకీయ పరమైన విమర్శలు కాస్తా.. వ్యక్తిగత విమర్శలకు దారి తీసింది. చివరికి తన మన అనే భేదం కూడా మర్చిపోయారు. వ్యక్తిత్వ హననం చేసేస్థాయికి దిగజారి పోయారు. ఇంట్లో మహిళలను, చిన్న పిల్లలపై కూడా నీచమైన కామెంట్లు చేస్తున్నారు. దీంతో గతంలో కలిసి పనిచేసిన వాళ్లు కూడా ఇప్పుడు ఎదురు పడితే కారాలు, మిరియాలు నూరుతున్నారు. తమ స్థాయి మర్చిపోయి మరీ నోరు పారేసుకుంటున్నారు.

అయితే రెండు రోజులుగా ఏపీ రాజకీయాల్లో ఆశక్తికర పరిణామం చోటు చేసుకుంటుంది. నిన్నటి వరకు నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుగా కామెంట్లు చేసుకున్న ప్రధాన పార్టీల నేతలు.. ఇప్పుడు కుశల ప్రశ్నలు వేసుకుంటున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు చిన్న శస్త్రచికిత్స జరిగింది. ఆయన త్వరగా కోలుకోవాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీనికి స్పందించిన పవన్ కల్యాణ్.. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక జగన్ తల్లి వైఎస్ విజయలక్ష్మికి టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులో విజయమ్మ అంటూ సంబోధించారు.

Also Read : స్లీపర్ బస్సుల నిషేధం సాధ్యమేనా..?

ఇక ఎప్పుడూ చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేసే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు.. మహా అయితే మరో రెండేళ్లు బతుకుతాడేమో అంటూ చంద్రబాబుపై నోరు పారేసుకున్నారు జగన్. 70 ఏళ్లు దాటిన ముసలాయన చంద్రబాబు అంటూ వ్యాఖ్యలు చేసిన జగన్.. ఇప్పుడు మాత్రం.. ఆయన ఆరోగ్యంగా ప్రశాంతంగా జీవించాలని కోరుతూ జగన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఇది రాజకీయ విలువలకు నిదర్శనం అంటున్నారు విశ్లేషకులు. రాజకీయంగా ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ, వ్యక్తిగత విషయాల్లో, ఇటువంటి సందర్భాల్లో నేతలు ఒకరినొకరు గౌరవించుకోవడం మంచి పరిణామమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ రకమైన సానుకూల ధోరణి రాజకీయ విలువలని పెంచుతుందని సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

రోడ్డు ప్రమాదాలపై కేంద్రం...

దేశంలో నానాటికీ పెరిగిపోతున్న ఘోర రోడ్డు...

వైసిపి మాజీ ఎమ్మెల్యే...

శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

ఉరవకొండలో పొలిటికల్ హీట్.....

ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాజకీయ వాతావరణం...

ఉత్తరాంధ్ర కాదు.. ఇక...

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి...

పోల్స్