గత కొన్నాళ్ళుగా వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న.. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఎట్టకేలకు తన బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టాడు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ఈ స్టార్ హీరోను.. అతని ఫేవరెట్ డైరెక్టర్ ప్రియదర్శన్ మళ్లీ ఫామ్ లోకి తీసుకొచ్చాడు. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన ఫాంటసీ హారర్ కామెడీ భూత్ బంగ్లా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. శాక్‌నిల్క్ నివేదికల ప్రకారం, ఈ చిత్రం మొదటి వారాంతంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 95.87 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
Also Read : ఏపీకి మోదీ సర్కార్ వరాలు..!
ముఖ్యంగా ఆదివారం నాడు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విశ్వరూపం చూపించింది. శనివారంతో పోలిస్తే ఆదివారం 21% ఎక్కువ వసూళ్లు వచ్చాయి. దేశవ్యాప్తంగా 11,682 షోల నుండి కేవలం ఒక్కరోజే రూ. 23 కోట్లు కొల్లగొట్టింది. దీంతో.. భారత్ లో మూడు రోజుల్లోనే నెట్ వసూళ్లు రూ. 58 కోట్లకు చేరుకున్నాయి. విదేశాల్లో కూడా ఈ సినిమా హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఓవర్సీస్ మార్కెట్ లో ఆదివారం నాడే రూ. 7 కోట్లు రాబట్టింది ఈ చిత్రం. మొత్తం మీద అక్కడ రూ. 26.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
Also Read : తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి సీఎం చంద్రబాబు
ఇండియాలో సాధించిన రూ. 69.37 కోట్ల గ్రాస్ వసూళ్లను కలిపితే, మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్త వసూళ్లు రూ. 95.87 కోట్లకు చేరాయి. సోమవారం నాటికి ఈ సినిమా సునాయాసంగా రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. చాలా కాలం తర్వాత అక్షయ్ కుమార్ తనదైన మార్కు కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించడం ఈ సినిమా విజయానికి ప్రధాన కారణమైంది. వరుస పరాజయాల తర్వాత అక్షయ్ కుమార్ దరిద్రం వదిలిపోయిందని, ప్రియదర్శన్ తన మిత్రుడికి ఒక పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ ఇచ్చారని అభిమానులు ఖుషీ అవుతున్నారు.

