Wednesday, April 15, 2026 08:33 PM
Wednesday, April 15, 2026 08:33 PM

ఎంపీ మిథున్ రెడ్డిది అహంకారమా.. సమాచార లోపమా?

వైసీపీ అధికారంలో ఉన్నా లేకున్నా… ఒక కుటుంబం మాత్రం తమ హవాను కొనసాగిస్తూనే ఉంది. ఆ కుటుంబం ఎవరిదో పెద్దగా ఆలోచించాల్సిన అవసరంలేదు. అదే పెద్దిరెడ్డి ఫ్యామిలీ. చిత్తూరు జిల్లా పుంగనూరులో తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేటలో కొడుకు మిథున్ రెడ్డి సాగించిన అరాచకాలు అన్నీ ఇన్నీకావు. భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపకుడు బోడె రామచంద్ర యాదవ్ గత ఎన్నికల్లో సాధించిన ఓట్ల వివరాలపై మిథున్ రెడ్డి చేసిన కామెంట్లు ఆయనకున్న సమాచార లోపానికి నిదర్శనంగా చెబుతున్నారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పుంగనూరు నియోజకవర్గం నుండి పోటీ చేసిన ఆయనకు 4,559 ఓట్లు వచ్చాయి.

Also Read : బ్రేకింగ్: టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్

గతంలో 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఆయన జనసేన పార్టీ తరఫున పుంగనూరు నుండి పోటీ చేసి 16,452 ఓట్లు సాధించారు. భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్‌ పై తాజాగా మిథున్ రెడ్డి ఒక ఛానెల్ డిబేట్ లో చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. తన తండ్రిపై పోటీ చేసిన వ్యక్తికి వచ్చిన ఓట్లు ఎన్నో మిథున్ రెడ్డికి తెలియదని అనుకోవాలా? పోనీ ఆయన డిబేట్ లో మాట్లాడుతున్నప్పుడు గణాంకాలు తప్పయితే దానిని సరిచేయాల్సిన బాధ్యత ఆ ఛానెల్ కి అన్నీ తానే అని భావించే సీనియర్ జర్నలిస్ట్ కి లేదా?

వైసీపీ నేతలు ఏం చెప్పినా.. అన్నిటికి తలలూపడం అలవాటైందని అనుకోవాలా అని సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చిపడుతున్నాయి. గతంలోనూ పార్లమెంటులో చర్చ సందర్భంగా 2019-2024మధ్యకాలంలో అప్పటి టీడీపీ ఎంపీ, ప్రస్తుతం కేంద్ర విమానయానశాఖ మంత్రిగా ఉన్న రామ్మోననాయుడిని ఉద్దేశించి చేసిన వ్యాఖల్ని అంతా గుర్తుచేసుకుంటున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుని అరెస్ట్ చేసి రాజమండ్రి జైలులో పెట్టినప్పుడు లోక్‌సభలో ఆ విషయాన్ని ప్రస్తావన చేస్తున్న సమయంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి రామ్మోహన్‌ నాయుడిని అవమానించారు.

ఉన్నది లోక్ సభలోనే అనే విషయాన్ని మరిచిపోయి సహచర సభ్యుడైన రామ్మోహన్ నాయుణ్ని రేయ్ అని సంభోదిస్తూ.. మాట్లాడింది చాల్లే కూర్చో అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం అని, లోక్ సభలో ఎక్కువ మంది సభ్యులున్నారనే అధికార దర్పంతో తోటి ఎంపీని అలా ప్రస్తావించడం దేశవ్యాప్తంగా విమర్శల పాలయింది. రోజులు గడిచిపోయాయి.. తిరిగి ఎన్నికలు వచ్చాయి. అధికార వైసీపీని ప్రజలు నేలకేసి కొట్టారు. 11 అసెంబ్లీ స్థానాలు, నాలుగు ఎంపీ స్థానాలకు కుదేలైంది.ఆనాడు రామ్మోహననాయుడు అన్నమాటలు చాలామందికి గుర్తుండే ఉంటాయి.

Also Read : శాంతి వెనుక.. ఇద్దరు మాజీ మంత్రులు..? బయటకు తీసుకురావడానికి కష్టాలు..!

గతంలో రామ్మోహన్ నాయుుడు పార్లమెంట్ లో మాట్లాడుతుండగా ఇచ్చిన టైమ్ అయిపోయింది… తొందరగా ముగించండి అని లోక్ సభ స్పీకర్ సూచించారు. దీంతో మరో రెండు నిమిషాలు సమయం ఇవ్వాలని రామ్మోహన్ కోరుతున్నా స్పీకర్ పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ఈ ఒక్కసారికి మరికొంత సమయం ఇవ్వాలని … వచ్చేసారి టిడిపి భారీ మెజారిటీతో పార్లమెంట్ కు వస్తుంది… అప్పుడు సమయం గురించి ఎలాంటి ఇబ్బంది వుండదంటూ రామ్మోహన్ నాయుడు చాలా కాన్పిడెంట్ గా మాట్లాడారు. ఆనాడు ఆయన అన్నట్లుగానే రాజకీయ సమీకరణలు మారిపోయాయి.

అప్పుడు సమయం కోసం అర్జించిన రామ్మోహన్ ఇప్పుడు కేంద్ర మంత్రి అయిపోయారు. ఎన్డిఏ ప్రభుత్వంలో టీడీపీదే ఇప్పుడు కీలక పాత్ర. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్నప్పుడు జోకులేసిన నేతల్లో ఒకరైన మిథున్ రెడ్డి లిక్కర్ స్కాంలో రాజమండ్రి జైలులో 71 రోజుల తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. ఆయన జైలులో ఉన్న టైంలో మిథున్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి జైలు బయట ఎంతగా తన కొడుకు కోసం వేచి ఉన్నారో అందరికీ తెలిసిందే. కాలగమనంలో ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలు అవుతాయి. ఇదంతా సహజంగా జరిగే ప్రక్రియ. కానీ దీన్ని మరిచి అన్ని రోజులు తమవే అని ఎగిరెగిరి పడితే తిరిగి లేవలేనిరీతిలో నేలకు కరుచుకోవాలని మిథున్ రెడ్డికి అర్థం కావడంలేదు.

-జి.సత్యనాారాయణ రాజు, సీనియర్ జర్నలిస్ట్

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇరాన్-అమెరికా మధ్య మళ్ళీ...

ప్రపంచాన్ని యుద్ధ భయం వణికిస్తున్న తరుణంలో...

రోజా, బైరెడ్డిపై కేసు...

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా...

డ్రైవర్ హత్య కేసులో...

ఏపీలో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం...

బ్రేకింగ్: టీడీపీ వర్కింగ్...

ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ.. తన...

తిరుమలలో ఆ దర్శనం...

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర...

నా భార్యకు భద్రత...

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...

పోల్స్