Friday, April 10, 2026 08:33 PM
Friday, April 10, 2026 08:33 PM

వైజాగ్: నెక్స్ట్ సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా

ఐటీలో టాప్‌ కంపెలన్నీ విశాఖకు క్యూ కడుతున్నాయి. గూగుల్‌ డేటా సెంటర్‌, టీసీఎస్, కాగ్నిజెంట్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు వైజాగ్ రావడంతో పాటు.. ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభించాయి. నక్కపల్లి మండలంలో లక్షన్నర కోట్ల భారీ పెట్టుబడితో మిట్టల్ స్టీల్‌ ప్లాంట్‌కు ఈ మధ్యే శంకుస్థాపన జరిగింది. తాజాగా దేశంలోనే రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఇన్ఫోసిస్‌ విశాఖలో పర్మనెంట్‌ క్యాంపస్‌ నిర్మాణంపై ముందడుగు పడింది.

Also Read : వైఎస్ఆర్ మరణానికి జగనే కారణం..!

రుషికొండ ఐటీ హిల్స్‌లో ఇన్ఫోసిస్‌ తాత్కాలిక క్యాంపస్ నడుస్తోంది. ఇందులో సుమారు వెయ్యి మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. విశాఖలో ఇన్ఫోసిస్‌ను మరింత విస్తరించాలని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలు.. ఐటీ కంపెనీలకు 99 పైసలకే ఎకరా భూమి ఇవ్వాలని విధాన నిర్ణయం తీసుకోవడం.. ఇరత మౌలిక సదుపాయాలు నచ్చడంతో.. ఇన్ఫోసిస్‌ విశాఖలో భారీ క్యాంపస్‌ నిర్మించాలని నిర్ణయించింది.

మధురవాడ సమీపంలోని ఎండాడ హిల్స్‌లో 20 ఎకరాలు కేటాయించాలని ఇన్ఫోసిస్‌ చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన ప్రభుత్వం.. ఈ ప్రతిపాదనకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రపంచ స్థాయి ఐటీ కంపెనీల రాకతో విశాఖలో ఐటీ ఎకో సిస్టమ్‌ డెవలప్‌ అవుతుంది. టీసీఎస్, ఇన్ఫోసిస్‌, కాగ్నిజెంట్‌ సంస్థల ద్వారానే వైజాగ్‌లో 50 వేల మంది ఐటీ ప్రొఫెషనల్స్‌కి ఉద్యోగాలు వస్తాయి. యాక్సెంచర్‌, ఐబీఎం, హెచ్‌సీఎల్, విప్రో వంటి కంపెనీలు విశాఖలో ల్యాండ్‌ అవుతున్నాయి. ఈ కంపెనీలన్నీ వస్తే.. వీటి వెనకాలే.. చిన్న, మధ్య స్థాయి ఐటీ సంస్థలూ.. క్యూ కడతాయి. టాప్‌ టాలెంట్‌ ఎక్కడుంటే.. అక్కడ ఐటీ ట్రైనింగ్‌, డెవలప్‌మెంట్‌ ఎకో సిస్టమ్‌ అభివృద్ధి చెందుతుంది. వీటికి తోడు సత్వా, రహేజా సంస్థలు నిర్మిస్తున్న ఐటీ పార్కుల్లో పదుల సంఖ్యలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు రాబోతున్నాయి.

Also Read : ఎవరీ ముకుల్ చౌదరి..? కేకేఆర్‌ పై సిక్సర్లతో విరుచుకుపడిన లక్నో స్టార్ బ్యాక్ స్టోరీ ఇదే..!

సీఎం చంద్రబాబు విజన్‌.. ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ ఎగ్జిక్యూషన్‌ మీదున్న నమ్మకంతో గూగుల్, మెటా వంటి అంతర్జాతీయ సంస్థలు విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఒకవైపు ఏఐ డేటా సెంటర్లు.. మరోవైపు ఏఐ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్ సెంటర్లు.. కొలువు తీరడంతో.. విశాఖ ప్రపంచానికే ఏఐ కేపిటల్‌గా మారబోతోంది. భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు కూడా అందుబాటులోకి రావడంతో.. మరో రెండేళ్లలో వైజాగ్‌ సిటీ.. గుర్తుపట్టలేనంతగా మార్పులు జరగబోతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కేబినెట్ సమాచారం లీక్.....

తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన...

ఉద్యోగులకు ఇచ్చిన హామీ...

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల...

ఎమ్మెల్యేలకు లోకేష్ వార్నింగ్..!

తెలుగుదేశం పార్టీలో సింగిల్ టైం ఎమ్మెల్యేలకు...

వైఎస్ఆర్ మరణానికి జగనే...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం...

ఢిల్లీ వెలుపల మరో...

అమరావతి రాజధాని అభివృద్ధికి సంబంధించి మరో...

బ్రేకింగ్: మహానాడు పై...

తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే...

పోల్స్