Friday, June 19, 2026 11:50 PM
Friday, June 19, 2026 11:50 PM

ఎవరీ ముకుల్ చౌదరి..? కేకేఆర్‌ పై సిక్సర్లతో విరుచుకుపడిన లక్నో స్టార్ బ్యాక్ స్టోరీ ఇదే..!

సాధారణంగా క్రికెట్ లో ఎప్పుడు ఎలా ఉంటుందో నమ్మలేం. ఒక్కోసారి ఒక్క శాతం అవకాశం ఉన్నా సరే.. అది గెలుపు దిశగా నడిపిస్తూ ఉంటుంది. నిన్న కేవలం 3 శాతం విజయవకాశాలతో లక్నో జట్టు అదిరిపోయే విక్టరీ సాధించింది. దీనికి కారణం.. లక్నో బ్యాటర్ ముకుల్ చౌదరి.. నిన్న ఈడెన్ గార్డెన్స్‌ లో జరిగిన మ్యాచ్‌ లో కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లను ఉతికి ఆరేసాడు. చివరి ఓవర్లలో ఒత్తిడిని చిత్తు చేస్తూ, అసాధ్యమనుకున్న లక్ష్యాన్ని సుసాధ్యం చేసిన ఈ యంగ్ సెన్సేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాడు. మరి అసలు ఎవరీ ముకుల్..? ఈ స్టోరీలో చూద్దాం.

Also Read : త్రిషాతో రిలేషన్.. విజయ్ ఫుల్ క్లారిటీ..!

ముకుల్ చౌదరి ఉత్తరప్రదేశ్ దేశవాళీ క్రికెట్ నుండి ఐపిఎల్ వరకు వచ్చాడు. చిన్నప్పటి నుండి దూకుడుగా ఆడటం ఇతని స్టైల్. దేశవాళీ టోర్నీలలో.. ముఖ్యంగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మెరుపు ఇన్నింగ్స్‌ లు ఆడి ఐపీఎల్ వేలం పాటలో ఎంటర్ అయ్యాడు. గత వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం ఇతనిలోని టాలెంట్‌ ను గుర్తించి జట్టులోకి తీసుకుంది. లోయర్ ఆర్డర్‌ లో వచ్చి భారీ హిట్లు కొట్టగల సమర్థుడని యాజమాన్యం నమ్మింది. కేకేఆర్‌ తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 27 బంతుల్లోనే 54 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

Also Read : ధోనీ రీఎంట్రీ మరింత ఆలస్యం..? ఇప్పట్లో కష్టమేనా..?

ఇందులో ఎక్కువ పరుగులు సిక్సర్ల రూపంలోనే రావడం విశేషం. అతని షాట్ సెలెక్షన్, హ్యాండ్ పవర్ కు క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఒత్తిడిలో సిక్స్ లు కొట్టడం అనేది ఓ సవాల్. కానీ ఆ సవాల్ ను ధైర్యంగా స్వీకరించి.. అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. హర్దిక్ పాండ్యా, రింకూ సింగ్ లాగా చివరి ఓవర్లలో మ్యాచ్‌ను గెలిపించే సత్తా ఇతనికి ఉందని నిన్నటి మ్యాచ్ నిరూపించింది. రాబోయే మ్యాచ్‌ల్లో కూడా ఇదే జోరు కొనసాగిస్తే టీమిండియా తలుపులు తట్టడం ఖాయం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

పోల్స్