Tuesday, August 4, 2026 05:58 PM
Tuesday, August 4, 2026 05:58 PM

వైసీపీకి పవన్ అదిరిపోయే కౌంటర్..!

తాజాగా ఓ మీడియా ఛానల్ అధినేత చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు నిరసనలు వ్యక్తం చేయడం పట్ల.. భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. ఇటీవలి వైసీపీ నేతలు చేస్తున్న వ్యక్తిగత దూషణలు, దిగజారుడు రాజకీయాలను ఆయన ఎండగట్టారు. రాజకీయాల్లో విమర్శలు ఉండాలి కానీ, అవి వ్యక్తిగత స్థాయికి దిగజారకూడదని హితవు పలికారు. దాడులు చేయడం తమ సంస్కృతి కాదని, అరాచక వ్యాఖ్యలకు న్యాయస్థానాల్లో కూడా తేల్చుకునే అవకాశం ఉందని సూచించారు.

Also Read : బ్రేకింగ్ : రెడ్డప్పగారి మాధవి, బీటెక్ రవిపై లోకేష్ సీరియస్

గతంలో వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ పవన్ తీవ్ర విమర్శలు చేశారు. సొంత భార్యను కారుతో పోల్చి మాట్లాడిన జగన్ వాచాలత్వాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదు. అంతకంటే దిగజారుడుతనం ఇంకేముంటుంది..? అని ఆయన ప్రశ్నించారు. గత అసెంబ్లీలో అప్పటి ప్రతిపక్ష నేత.. చంద్రబాబు నాయుడు సతీమణిపై అత్యంత నీచంగా వ్యాఖ్యలు చేస్తుంటే, జగన్ వాటిని అడ్డుకోకపోగా ప్రోత్సహించారని పవన్ మండిపడ్డారు. వైసీపీ నేతలు వాడుతున్న అభ్యంతరకర భాషను కూటమి పార్టీలు అదే స్థాయిలో తిప్పికొట్టాల్సిన అవసరం లేదని పవన్ సూచించారు.

Also Read : దేవాదాయ శాఖలో ఏసీబీ “శాంతి” హోమం..!

దాడులు సమాధానం కాదు. మనం ప్రజాస్వామ్య పంథాను అనుసరించాలి. చట్టానికి ఎవరూ చుట్టాలు కాదు, న్యాయస్థానాల్లోనే పోరాడి వారికి గుణపాఠం చెబుదామని కూటమి శ్రేణులకు పిలుపునిచ్చారు. వైసీపీ నేతలు నిత్యం దిగజారి మాట్లాడుతున్నారని, వారి భాష సభ్య సమాజం అసహ్యించుకునేలా ఉందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎదుటివారి వ్యక్తిత్వాన్ని కించపరచడమే వైసీపీ విధానంగా మారిందని, ఇలాంటి ప్రవర్తనను ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు. ఇక టీడీపీ, జనసేన సోషల్ మీడియా, గతంలో వైసీపీ నేతలు మాట్లాడిన వీడియోలను వైరల్ చేస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్