Saturday, June 20, 2026 08:34 AM
Saturday, June 20, 2026 08:34 AM

దేవాదాయ శాఖలో ఏసీబీ “శాంతి” హోమం..!

గత రెండేళ్ళ నుంచి ఏపీలో హాట్ టాపిక్ గా మారిన.. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాళింగిరి శాంతిని నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. రాజకీయ నాయకుల అండతో ఆమె అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించారు అని ఆరోపణలు రాగా.. ఆ తర్వాత ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. నిన్న.. దాదాపు పది గంటల పాటు ఆమె నివాసంలో సోదాలు నిర్వహించి.. నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకోగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆమెను విజయవాడ సబ్ జైలుకు తరలించారు.

Also Read : ఏబీఎన్‌పై వైసీపీ దాడి.. దమ్ముంటే రా అంటూ ఆర్కేకు సవాల్..!

సోమవారం తెల్లవారుజాము నుంచి శాంతి నివాసాల్లో ఏసీబీ అధికారులు జరిపిన సోదాలు సంచలనం సృష్టించాయి. విచారణ అనంతరం ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు, కానూరులోని జడ్జి నివాసానికి తీసుకెళ్లారు. కేసు తీవ్రతను పరిశీలించిన న్యాయమూర్తి, ఈ నెల 21 వరకు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. దేవాదాయ శాఖలో ఉంటూనే శాంతి తన ఆస్తులను అక్రమంగా పెంచుకున్నట్లు ఏసీబీ ప్రాథమికంగా నిర్ధారించింది. సోదాల్లో బయటపడ్డ ఆస్తుల చిట్టా చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే.

Also Read : కార్పొరేట్ ఆసుపత్రుల దందా.. లేడీ డాక్టర్ బయటపెట్టిన నిజం

విశాఖలో లగ్జరీ ఫ్లాట్, తాడేపల్లిలో జీ+2 భవనం ఆమె కూడబెట్టారు. దాదాపు కేజీకి దగ్గరగా బంగారం, 3 కేజీల వెండి, లక్షల్లో నగదుతో పాటు పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన శాంతి, 2024 నుంచి 2026 మార్చి వరకు సస్పెన్షన్‌లో ఉన్నారు. కోర్టు మెట్లెక్కి మరీ మొన్న ఏప్రిల్ 2న విధుల్లో చేరారు. అయితే, సీటులో కూర్చున్న వారం రోజుల్లోనే ఏసీబీ షాక్ ఇవ్వడం, ఏకంగా జైలు పాలు కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఏసీబీ అధికారులు బినామీల వేటలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అక్రమ ఆస్తుల వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

పోల్స్