Saturday, June 20, 2026 07:32 AM
Saturday, June 20, 2026 07:32 AM

పుకార్లకు చెక్.. కేరళలో తారక్ కలరిపట్టు వేట..!

టాలీవుడ్ యంగ్ టైగర్.. ఎన్టీఆర్.. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ డ్రాగన్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై చిత్ర బృందం స్పష్టతనిచ్చింది. ఈ సినిమా షూటింగ్ వాయిదా పడిందని, తారక్ లుక్ విషయంలో మార్పులు చేస్తున్నారనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని మేకర్స్ కొట్టిపారేశారు. ఈ సినిమాపై టాలీవుడ్ జనాలు ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. ఇక సినిమా గురించి ఏ వార్త వచ్చినా సోషల్ మీడియా జనాలు పండుగ చేసుకుంటున్నారు. ఈ టైంలో సినిమా వాయిదా పడిందనే ప్రచారం మొదలైంది.

Also Read : దేవాదాయ శాఖలో ఏసీబీ “శాంతి” హోమం..!

దీనిపై రియాక్ట్ అయిన చిత్ర యూనిట్.. ముందుగా నిర్ణయించుకున్న ప్లాన్ ప్రకారమే సినిమా పనులు జరుగుతున్నాయని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులతో పాటు, ఎన్టీఆర్ ఈ సినిమా కోసం స్పెషల్ గా రెడీ అవుతున్నట్టు తెలిపింది. ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్ సీక్వెన్స్‌ ల కోసం తారక్ తన బాడీ లాంగ్వేజ్‌ ను, ఫైటింగ్ స్టైల్‌ ను పూర్తిగా మార్చే పనిలో ఉన్నాడని తెలిపింది. ఈ సినిమాలో తారక్ పాత్ర మోస్ట్ పవర్‌ ఫుల్‌ గా ఉండబోతోందని తెలుస్తోంది.

Also Read : కార్పొరేట్ ఆసుపత్రుల దందా.. లేడీ డాక్టర్ బయటపెట్టిన నిజం

దీని కోసం ఆయన ప్రస్తుతం కేరళలో అత్యంత పురాతన యుద్ధ విద్య అయిన కలరిపట్టు లో కఠినమైన శిక్షణ తీసుకుంటున్నాడు అని ప్రకటించింది. సినిమాలో వచ్చే కొన్ని హై-వోల్టేజ్ యాక్షన్ సీన్లలో ఈ విద్యను ప్రదర్శించబోతున్నాడని సమాచారం. తారక్ డెడికేషన్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద మరో డామినేషన్ కు ముహూర్తం ఫిక్స్ అయినట్టు కనపడుతోంది. దేవర తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాపై కేవలం సౌత్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో.. భారీ అంచనాలు ఉన్నాయి. ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని గతంలో ఎన్నడూ చూడని రీతిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే తారక్ కొత్త లుక్‌కు సంబంధించిన అధికారిక అప్‌డేట్ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల టాక్.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

పోల్స్