Saturday, June 20, 2026 08:31 AM
Saturday, June 20, 2026 08:31 AM

బుమ్రా వర్సెస్ వైభవ్.. ఐపిఎల్ లో ఇంట్రస్టింగ్ పోరు..!

ఐపీఎల్ తాజా సీజన్‌ లో నేడు జరగబోయే మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య గువహటి వేదికగా ఆసక్తికరమైన పోరు జరగనుంది. అయితే, ఈ మ్యాచ్‌ లో అందరి కళ్ళు కేవలం గెలుపోటములపైనే కాదు.. ఒకవైపు టీం ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, మరోవైపు ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడు, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మధ్య జరగబోయే పోరుపై క్రికెట్ ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. 2025 మెగా వేలంలో.. రాజస్థాన్ రాయల్స్ వైభవ్ ప్రతిభను గుర్తించి రూ. 1.10 కోట్లకు వేలంలో సొంతం చేసుకుంది.

Also Read : కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త!

ఈ మధ్య కాలంలో డొమెస్టిక్ క్రికెట్ తో పాటుగా అండర్ 19 జట్టులో అతను ఆడుతున్న ఆట తీరు చర్చనీయంశంగా మారింది. అండర్ 19 ప్రపంచకప్ లో భారత్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ గత ఏడాది తొలి సీజన్ లోనే అందరి దృష్టిని ఆకర్షించగా, నేడు బుమ్రా లాంటి దిగ్గజ బౌలర్‌ను ఎదుర్కోవడం అతని కెరీర్‌కే అతిపెద్ద పరీక్ష కానుంది. మరోవైపు, ముంబై ఇండియన్స్ అమ్ములపొదిలో అత్యంత పదునైన అస్త్రంగా చెప్పుకునే.. జస్ప్రీత్ బుమ్రాను ఎలా ఎదుర్కొంటాడు అనేది ఆసక్తికరంగా మారింది.

Also Read : ఇలా అయితే కష్టమే.. సీనియర్ల అసహనం..!

ముఖ్యంగా పవర్ ప్లే ఓవర్లలో బుమ్రా వేసే ఇన్ స్వింగర్లు, స్లోయర్ బంతులను ఎదుర్కోవడం సీనియర్ ఆటగాళ్లకే సాధ్యం కాదు. అలాంటి పరిస్థితుల్లో, ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌ లోకి అడుగుపెడుతున్న వైభవ్, బుమ్రా స్పీడ్‌ ను, మైండ్ గేమ్‌ ను ఎలా తట్టుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. రాజస్థాన్ రాయల్స్ వైభవ్ సూర్యవంశీని ఒక సర్ ప్రైజ్ ప్యాకేజీలా వాడుతోంది. పవర్ ప్లేలో అతను ఇచ్చే మెరుపు ఆరంభం జట్టుకు చాలా కీలకం. అయితే, హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్, వైభవ్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు బుమ్రాను పవర్ ప్లేలోనే ప్రయోగించే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

పోల్స్