గత కొన్నాళ్ళుగా ప్రభుత్వాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా టార్గెట్ చేస్తూ వస్తున్న బిజేపి సీనియర్ నేత, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వంలో మరోసారి కలకలం రేపాయి. నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధమని ఆయన సంచలన ప్రకటన చేశారు. గత కొంతకాలంగా నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆదినారాయణ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి.
Also Read : ఇలా అయితే కష్టమే.. సీనియర్ల అసహనం..!
కూటమిలో కొందరు నేతలు తనను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ప్రజల కంటే నాకు పదవి ముఖ్యం కాదు. నియోజకవర్గ అభివృద్ధికి ఆటంకం కలిగితే ఆ పదవిలో కొనసాగాల్సిన అవసరం లేదు అని ఆయన స్పష్టం చేశారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో నిలిచిపోయిన పెండింగ్ పనులను తక్షణమే పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారంలో జరుగుతున్న జాప్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయాలు చేయడం కంటే, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే తన ప్రథమ ప్రాధాన్యతని స్పష్టం చేసారు ఎమ్మెల్యే.
Also Read : అదిరిపోయిన రష్మిక బర్త్ డే గిఫ్ట్..!
రాజీనామా విషయంలో తాను ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చానని ఆదినారాయణ రెడ్డి సంకేతాలు ఇచ్చారు. నేను కొన్ని రోజులు వేచి చూస్తాను.. సమస్యలు పరిష్కారం కాకపోతే, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను అంటూ ఓ రకంగా వార్నింగ్ ఇచ్చారు. జిల్లాలో కీలక నేతగా భావిస్తున్న ఆదినారాయణ రెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కూటమి ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉందనే మాట వినపడుతోంది. మరి ఆదినారాయణ రెడ్డిని బుజ్జగించడానికి అధిష్టానం రంగంలోకి దిగుతుందా..? లేక ఆయన తన నిర్ణయానికే కట్టుబడి రాజీనామా చేస్తారా..? అనేది చర్చనీయంశంగా మారింది.

