Wednesday, April 1, 2026 05:41 PM
Wednesday, April 1, 2026 05:41 PM

హోటల్ ఫుడ్ ఇక భారమే.. ఆయిల్ కంపెనీలు సంచలన నిర్ణయం..!

కమర్షియల్ గ్యాస్ ఉపయోగించే.. వినియోగదారులకు చమురు సంస్థలు గట్టి షాక్ ఇచ్చాయి. 19 కేజీల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. నేటి నుంచి అమలులోకి వచ్చిన ఈ ధరల పెరుగుదల ప్రభావం నేరుగా సామాన్యుడి ఆహారపు అలవాట్లపై పడే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లలో వాడే కమర్షియల్ సిలిండర్ల ధరలు పెరగడంతో, తినుబండారాల ధరలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. తాజాగా 19 కేజీల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ పై ఏకంగా రూ.195.50 పెరిగింది.

Also Read : వాట్సాప్ యూజర్లకు కేంద్రం గుడ్ న్యూస్..!

దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కలకత్తాలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ పై అత్యధికంగా రూ.218 పెంచారు. ఈ భారీ పెంపుతో వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కమర్షియల్ గ్యాస్ ధరలు పెరగడం వల్ల హోటల్ యజమానులు తమ నిర్వహణ భారాన్ని.. భర్తీ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. దీనివల్ల టిఫిన్లు, భోజనం, ఇతర ఆహార పదార్థాల ధరలు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. బయట భోజనం చేసే సామాన్యులకు ఇది అదనపు భారంగా మారనుంది.

Also Read : నవ్యాంధ్ర చరిత్రలో కీలక అడుగు.. నేడు పార్లమెంట్ లో కీలక పరిణామం..!

ఇప్పటికే నిత్యావసర ధరలతో సతమతమవుతున్న ప్రజలకు, ఇప్పుడు ఫుడ్ బిల్లులు పెరగడం మింగుడుపడని విషయమే. అయితే, గృహ వినియోగదారులకు మాత్రం చమురు సంస్థలు ఊరటనిచ్చాయి. డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ధరల్లో ఎటువంటి మార్పు చేయలేదు. అంతర్జాతీయ మార్కెట్‌ లో ముడిచమురు ధరల హెచ్చుతగ్గుల వల్ల ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా తగ్గుతూ వచ్చిన కమర్షియల్ గ్యాస్ ధరలు, ఇప్పుడు ఒక్కసారిగా భారీగా పెరగడం గమనార్హం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఎమ్మెల్యేలు సీరియల్స్ చూడటం...

కూటమి ప్రభుత్వంలోని కొందరు ఎమ్మెల్యేల తీరుపై...

ఈసారి మావిగన్ అంటున్న...

ఎవరికైనా చూపించండి రా.. అలా వదిలేయకండి...

బ్రేకింగ్: మారిన మాట.....

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి విషయంలో...

నవ్యాంధ్ర చరిత్రలో కీలక...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భవిష్యత్తుకు సంబంధించి...

దుమారం రేపుతున్న కాగ్...

కాంగ్రెస్ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణపై కంప్ట్రోలర్...

మెగా ఫ్యాన్స్ కు...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

పోల్స్