Friday, October 9, 2026 05:19 AM
Friday, October 9, 2026 05:19 AM

బ్యాంకింగ్‌ నిబంధనల్లో భారీ మార్పులు.. ఏటీఎం, యూపీఐ లావాదేవీలపై ఛార్జీల మోత..!

నేటి నుంచి దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వివిధ బ్యాంకులు ప్రకటించిన నూతన నిబంధనలు నేటి నుంచే అమలులోకి వస్తున్నాయి. ఏటీఎం విత్‌ డ్రాయల్స్ నుంచి టోల్ ప్లాజాల వరకు చార్జీల మోత మోగనుంది. ముఖ్యంగా ఏటీఎంల ద్వారా నగదు విత్ డ్రాపై బ్యాంకులు పరిమితులను సవరించాయి. మెట్రో నగరాల్లో నెలకు 3 నుండి 5 ఉచిత లావాదేవీల పరిమితిని దాటితే, ఆ తర్వాత చేసే ప్రతి విత్‌ డ్రాయల్‌ పై అదనపు ఛార్జీలు వర్తిస్తాయి.

Also Read : నవ్యాంధ్ర చరిత్రలో కీలక అడుగు.. నేడు పార్లమెంట్ లో కీలక పరిణామం..!

ఈ ఉచిత పరిమితి ముగిసిన తర్వాత ప్రతి అదనపు ట్రాన్సాక్షన్‌ కు సుమారు రూ.23 వరకు ఛార్జీ వసూలు చేయనున్నాయి. మరో కీలక మార్పు ఏమిటంటే, ఏటీఎంలలో కార్డ్‌ లెస్‌, యూపీఐ లావాదేవీలపై కూడా ఇక నుంచి ఛార్జీలు పడనున్నాయి. ఇప్పటివరకు యూపీఐ ద్వారా ఏటీఎంలో నగదు విత్ డ్రా చేయడం.. అదనపు ఫీచర్ గా ఉండేది. కానీ నేటి నుంచి ఈ కార్డ్‌లెస్ నగదు విత్‌ డ్రాయల్స్‌ ను కూడా సాధారణ ఏటీఎం లావాదేవీలుగానే పరిగణిస్తారు. అంటే, ఇవి కూడా మీ నెలవారీ ఉచిత పరిమితిలో భాగమే.

Also Read : ఇంట్లో కూడా సన్‌ స్క్రీన్ వాడాల్సిందేనా..?

చాలా మంది తమ బ్యాంక్ బ్యాలెన్స్‌ ను మొబైల్ యాప్‌లలో లేదా ఏటీఎంలలో పదేపదే చెక్ చేస్తుంటారు. ఇకపై అలా చేస్తే జేబు ఖాళీ అవ్వక తప్పదు. ఏటీఎంలలో బ్యాలెన్స్ చెక్ చేయడం లేదా మినీ స్టేట్‌మెంట్ తీసుకోవడం వంటి నాన్-ఫైనాన్షియల్ లావాదేవీలు ఉచిత పరిమితి దాటితే ఒక్కోదానికి రూ.10 నుండి రూ.12 వరకు ఛార్జీ పడే అవకాశం ఉంది. అటు జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి కూడా చార్జీల మోత మోగుతుంది. నేటి నుంచి టోల్‌ప్లాజాల వద్ద నగదు లావాదేవీలను పూర్తిగా నిలిపివేస్తున్నారు. టోల్ ఫీజును కేవలం ఫాస్టాగ్, లేదా యూపీఐ ద్వారా మాత్రమే చెల్లించాలి. ఒకవేళ ఫాస్టాగ్ పనిచేయకపోయినా లేదా నగదు ఇస్తామని చెప్పినా.. నిబంధనల ప్రకారం రెట్టింపు ఫీజు వసూలు చేస్తారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఇది జగన్ వ్యూహమా?...

స్థానిక సంస్థల ఎన్నికల్లో YSRCP వ్యవహరిస్తున్నతీరు...

స్థానిక సంస్థల ఎన్నికల...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల...

టీటీడీ పై విజయసాయిరెడ్డి...

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పునర్వ్యవస్థీకరణ,...

గాల్లోనే విమానంపై పడ్డ...

ఆకాశంలో ప్రయాణిస్తున్న ఒక విమానంలో ప్రయాణికులకు...

రాజకీయాల్లోకి యంగ్ హీరో...

తమిళనాట సినీ గ్లామర్‌కు, రాజకీయాలకు ఎప్పుడూ...

ప్లాస్టిక్ కరెన్సీ రెడీ.....

రూ.2 వేల నోట్లు ఇప్పుడు ఎక్కడా...

పోల్స్