Tuesday, August 18, 2026 09:05 PM
Tuesday, August 18, 2026 09:05 PM

పాక్ ఉగ్రవాదులకు స్వర్గం.. అమెరికా సంచలన నివేదిక..!

ఉగ్రవాదానికి పాకిస్థాన్ ఇంకా అడ్డాగానే కొనసాగుతోందని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. అమెరికా చట్టసభలకు చెందిన స్వతంత్ర పరిశోధనా విభాగం కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్.. తాజాగా విడుదల చేసిన నివేదికలో పాక్ ఉగ్రవాదంపై దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించింది. పాక్ సైన్యం అనేక ఆపరేషన్లు చేపట్టినట్లు చెబుతున్నా, ఇప్పటికీ ఆ దేశ గడ్డపై 15 ప్రధాన ఉగ్రవాద గ్రూపులు సురక్షితంగా తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయని ఈ నివేదిక పేర్కొంది. ఈ 15 ఉగ్రవాద ముఠాలను అమెరికా ఐదు ప్రధాన వర్గాలుగా విభజించింది.

Also Read :  ఇది చెన్నై జట్టేనా..? మరి ఇంత దారుణమా..?

ఇందులో అంతర్జాతీయ లక్ష్యాలున్న అల్ ఖైదా వంటి సంస్థలతో పాటు, ప్రధానంగా భారత్‌ లోని.. జమ్మూ కాశ్మీర్‌ ను టార్గెట్ చేసుకున్న లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి సంస్థలు ఉన్నాయని వివరించింది. వీటిలో దాదాపు 12 గ్రూపులను అమెరికా ఇప్పటికే విదేశీ ఉగ్రవాద సంస్థలుగా గుర్తించింది. పాకిస్థాన్ చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక చర్యలు కేవలం నామమాత్రంగానే ఉన్నాయని అమెరికా తేల్చి చెప్పింది. ఆఫ్ఘనిస్థాన్‌ లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత పాకిస్థాన్‌ లో ఉగ్రవాద హింస మరింత పెరిగిందని నివేదిక హెచ్చరించింది.

Also Read : అమరావతిలో కేటుగాళ్ళు.. స్పెషల్ ఫోకస్ పెట్టిన ఎస్పీ..!

2025లో పాక్‌లో ఉగ్రవాద సంబంధిత మరణాల సంఖ్య 4,001కి చేరుకుందని, ఇది గత 11 ఏళ్లలో అత్యధికమని వెల్లడించింది. ఒకవైపు భారత్ లాంటి పొరుగు దేశాలపై ఉగ్రవాదాన్ని ప్రయోగిస్తూ, ఇప్పుడు పాకిస్థాన్ అదే ఉగ్రవాదం బారిన పడి విలవిలలాడుతోందని అమెరికా విశ్లేషించింది. అంతర్జాతీయ వేదికలపై శాంతి గురించి మాట్లాడే పాక్, తన గడ్డపై ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం ఆపలేదని ఈ నివేదిక ద్వారా మరోసారి స్పష్టమైంది. తెహ్రిక్ ఈ తాలిబాన్ వంటి సంస్థలు పాక్ లో మరింత యాక్టివ్ అయ్యాయని తెలిపింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

APPSC గ్రూప్-1 అక్రమాలు.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిరుద్యోగ నియామకాల అంశం...

జోగి రమేష్ రాజకీయ...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,...

ప్రశ్న రావణ్‌కు షాక్.....

యూట్యూబర్ ప్రశ్న రావణ్ చుట్టూ చట్టపరమైన...

బీసీలకు చంద్రబాబు సర్కార్...

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన...

నాగబాబు.. ఇక నుంచి...

జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం...

అసెంబ్లీలో లోకేష్, సత్యకుమార్...

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తీవ్రమైన రాజకీయ చర్చల...

పోల్స్