Friday, October 9, 2026 04:01 AM
Friday, October 9, 2026 04:01 AM

ట్రంప్ నోటి దూల.. వాళ్ళు బానిసల బిడ్డలు అంటూ వివాదాస్పద కామెంట్..!

అమెరికాలో పుట్టే ప్రతి బిడ్డకు ఆటోమేటిక్‌గా వచ్చే పౌరసత్వంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వింత వాదనను తెరపైకి తెచ్చారు. రాజ్యాంగంలోని 14వ సవరణ ద్వారా లభించే ఈ పౌరసత్వ హక్కు కేవలం బానిసల పిల్లల కోసం ఉద్దేశించినదే తప్ప, విదేశీయుల కోసం కాదంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అగ్రరాజ్యంలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. అమెరికా అంతర్యుద్ధం ముగిసిన తర్వాత, అప్పట్లో బానిసలుగా ఉన్నవారి పిల్లలకు పౌరసత్వం కల్పించడం కోసమే 14వ సవరణను తీసుకువచ్చారని ట్రంప్ పేర్కొన్నారు.

Also Read : మెగా ఫ్యాన్స్ కు వెయింటింగ్ తప్పదా..? పెద్ది వాయిదా పడ్డట్టే..?

అది అప్పట్లో ఒక మంచి, గొప్ప ఉద్దేశం అని చెబుతూనే, ప్రస్తుతం ఇతర దేశాల నుంచి వచ్చే వారు ఈ చట్టాన్ని వాడుకోవడం హాస్యాస్పదమని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా చైనా వంటి దేశాల నుంచి ధనవంతులు వచ్చి, ఇక్కడ పిల్లలను కని, వారి ద్వారా తమ కుటుంబం మొత్తానికి పౌరసత్వం పొందేలా చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలో, అక్రమ వలసదారుల పిల్లలకు పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ట్రంప్ గతంలో జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.

Also Read : ఇరాన్-అమెరికా యుద్ధం.. భారత విద్యార్థులకు చుక్కలు..!

ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలైన “ట్రంప్ వర్సెస్ బార్బరా” కేసులో ఏప్రిల్ 1న అమెరికా సుప్రీంకోర్టు మౌఖిక వాదనలు వినడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ట్రంప్ తనపై వ్యతిరేక తీర్పులు ఇచ్చే న్యాయమూర్తులను తెలివి తక్కువ వారు అంటూ సంబోదించడం వివాదాస్పదం అయింది. ఒకవేళ ట్రంప్ వాదన నెగ్గి, సుప్రీంకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పునిస్తే.. అమెరికాలో నివసిస్తున్న వేలాది మంది భారతీయులపై కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. హెచ్-1బి వీసాలపై ఉంటూ అక్కడే పిల్లలకు జన్మనిస్తున్న భారత కుటుంబాల పిల్లలకు భవిష్యత్తులో అమెరికా పౌరసత్వం లభించడం కష్టతరమవుతుంది. 125 ఏళ్లకు పైగా అమల్లో ఉన్న ఈ రాజ్యాంగ నిబంధనపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే ఆందోళన నెలకొంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఇది జగన్ వ్యూహమా?...

స్థానిక సంస్థల ఎన్నికల్లో YSRCP వ్యవహరిస్తున్నతీరు...

స్థానిక సంస్థల ఎన్నికల...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల...

టీటీడీ పై విజయసాయిరెడ్డి...

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పునర్వ్యవస్థీకరణ,...

గాల్లోనే విమానంపై పడ్డ...

ఆకాశంలో ప్రయాణిస్తున్న ఒక విమానంలో ప్రయాణికులకు...

రాజకీయాల్లోకి యంగ్ హీరో...

తమిళనాట సినీ గ్లామర్‌కు, రాజకీయాలకు ఎప్పుడూ...

ప్లాస్టిక్ కరెన్సీ రెడీ.....

రూ.2 వేల నోట్లు ఇప్పుడు ఎక్కడా...

పోల్స్