Thursday, July 2, 2026 02:55 PM
Thursday, July 2, 2026 02:55 PM

మూడో కృష్ణుడు ఎన్నాళ్లుంటారు..?

గతంలో ఊర్లల్లో వీధి నాటకాలు బాగా ఫేమస్. అందులో కురుక్షేత్రం డ్రామాలో ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు అంటూ ఒకరి తర్వాత ఒకరు తెర పైకి వచ్చేవారు. ప్రస్తుతం రాజధాని పనులు పర్యవేక్షిస్తున్న క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ.. సీఆర్‌డీఏకు ఇప్పుడు ముచ్చటగా మూడో ఐఏఎస్ అధికారి కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. కురుక్షేత్రంలో ఘన విజయం సాధించిన తర్వాత కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు కావస్తొంది. కానీ.. రెండేళ్లల్లో ముగ్గురు కమిషనర్‌లను మార్చటం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Also Read : ధర్నా వ్యవహారంపై సిఎం ఆరా.. షాక్ అయిన అధికారులు..!

కురుక్షేత్రం నాటకంలో మాదిరిగా మూడో కృష్ణుడు తర్వాత నాలుగో కృష్ణుడు కూడా తెరపైకి వస్తారా అనే చర్చ ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో బాగా వినిపిస్తోంది. మంత్రిగా నారాయణ ఉన్నంత కాలం అమరావతి పరిస్థితి ఆదోగతే అనేది రైతులు బహిరంగంగా చేస్తున్న విమర్శలు. తాజా విషయం ఏమిటంటే.. మూడేళ్లల్లో రాజధాని అమరావతిలో అన్నీ నిర్మాణాలు పూర్తి చేస్తామని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తే మాత్రం.. మరో ఆరేళ్లు అయినా పూర్తి అవుతాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇందుకు ప్రధానంగా మంత్రి నారాయణ వ్యవహరిస్తున్న తీరును ఉదాహరిస్తున్నారు. దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించటం లేదనేలా మంత్రి నారాయణ తీరు ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు.

Also Read : ఇరాన్-అమెరికా యుద్ధం.. భారత విద్యార్థులకు చుక్కలు..!

అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేసేందుకు అహో రాత్రులు కష్టపడుతున్నామని మంత్రి నారాయణ చెబుతున్న మాటలు.. నీటి మూటలుగానే కనిపిస్తున్నాయని రైతులు చెబుతున్నారరు. ప్రస్తుతం బాధ్యతలు చేపట్టిన సీఆర్‌డీఏ మూడో కృష్ణుడు అంటే కమీషనర్ పని తీరు ఎలా ఉండబోతుందో.. మంత్రి నారాయణ ఆదేశాల అడుగులకు మడుగులొత్తుతారా.. సీఆర్‌డీఏ మాజీ కమీషనర్ కాటమనేని భాస్కర్ మాదిరిగా ముక్కుసూటిగా, నిజాయితీగా పనిచేస్తారా.. ? అత్యంత నిజాయితీ పరునిగా పేరున్న భాస్కర్‌నే పనిచేయకుండా అడుగడుగునా అడ్డుపడ్డారు. అలాంటిది ప్రస్తుత కమీషనర్ విజయ రామరాజును అడ్డుకోకుండా ఉంటారా..? అనేది ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న.

కొసమెరుపు ఏమిటంటే.. సీఆర్‌డీఏ మొదటి కమీషనర్‌గా కాటమనేని భాస్కర్‌ను సీఎం చంద్రబాబు ఏరికోరి నియమించారు. ఆయన తర్వాత రెండో కమీషనర్‌గా వైసీపీ అభిమాన ఐఏఎస్ అధికారిగా ముద్ర ఉన్న కన్నబాబును మంత్రి నారాయణ ఒత్తిడి తట్టుకోలేక నియమించారని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుత కమీషనర్ విజయ రామరాజును పోస్టింగ్‌లో మాత్రం మంత్రి నారాయణ ప్రమేయం లేదని.. ఆయన సిఫార్సులను పూర్తిగా పక్కన పెట్టారనేది సచివాలయ వర్గాల మాట.

Also Read : ఏపీలో ముగిసిన మావోల శకం.. ఆపరేషన్ కగార్ సక్సెస్..!

కాటమనేని భాస్కర్‌కు మంత్రి నారాయణకు మధ్య కోల్డ్ వార్ జరిగిన విషయం బహిరంగ రహస్యం. ఇక కన్నబాబుపైన అయితే.. లెక్కలేనన్ని ఆరోపణలున్నాయి. విశాఖపట్నం రుషికొండ పై జగన్ కోసం ఇంద్ర భవన నిర్మాణాన్ని దగ్గరుండి పర్యవేక్షించిన వైసీపీ అభిమాన ఐఏఎస్ అధికారిగా కన్నబాబుపై ముద్ర ఉంది. అలాంటి కన్నబాబును మంత్రి నారాయణ సిపార్సు చేశారు. ప్రస్తుత సీఆర్‌డీఏ కమీషరన్ విజయ రామరాజు వైసీపీ ప్రభుత్వంలో జగన్ సొంత జిల్లా కడప కలెక్టర్‌గా పని చేశారు. అప్పట్లో జగన్‌కు అత్యంత సన్నిహితునిగా మెలిగారు అనే ప్రచారం జరిగింది కూడా. అలాంటి అధికారిని ఇప్పుడు కీలకమైన రాజధాని నిర్మాణ పనులు పర్యవేక్షిస్తున్న సీఆర్‌డీఏ కమీషనర్‌ను చేయడం ఏమిటో.. అనే చర్చ జరుగుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వాట్సాప్ కొత్త ఫీచర్‌...

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇటీవల...

లేటుగా గుర్తొచ్చిన ముద్రగడ.....

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

సీఎంఓ‌లోకి మరో జగన్...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం వైసీపీ అభిమాన...

తమిళ రాజకీయాల్లో సంచలనం.....

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠ...

ఏపీ పెట్రోల్ బంకులపై...

ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖలో అవినీతిని అంతమొందించేందుకు,...

నాని అవుట్.. రోహిత్...

ఏపీలో ఎన్నికలు ఇంకా మూడేళ్ల సమయం...

పోల్స్