Friday, October 9, 2026 08:54 AM
Friday, October 9, 2026 08:54 AM

మర్యాదగా ఉండు.. కోపం వద్దు.. గంభీర్ కు గంగూలీ సలహా..!

2024 లో టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన, గౌతమ్ గంభీర్ దూకుడుపై సోషల్ మీడియాలోనూ, క్రికెట్ వర్గాల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో.. గంభీర్ వైఖరిపై తాజాగా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. గంభీర్ తన దూకుడును తగ్గించుకోవాలని, ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త మర్యాదగా ఉంటే మంచిదని సలహా ఇచ్చాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడుతూ.. గౌతమ్ గంభీర్ చాలా ప్యాషన్ ఉన్న వ్యక్తి అన్నాడు. అందులో సందేహం లేదన్నాడు.

Also Read : బ్రేకింగ్: ఐటీ రంగంపై ఇరాన్ అటాక్.. వెబ్ సర్వీసెస్ డౌన్..!

కానీ, ఒక కోచ్‌ గా ఉన్నప్పుడు బాధ్యత కూడా ఉంటుంది.. అందరితో మర్యాద లేకుండా ఉండాల్సిన అవసరం లేదని, గెలవాలనే కసి ఉండొచ్చు, కానీ అది ఇతరులను కించపరిచేలా ఉండకూడదని సలహా ఇచ్చాడు. సౌమ్యంగా ఉంటూనే ముందుకు వెళ్ళవచ్చని గంగూలీ అభిప్రాయపడ్డాడు. గంభీర్ తన కెరీర్ మొదటి నుండి చాలా సీరియస్‌ గా ఉంటాడనే విషయం తెలిసిందే. అయితే, కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అతను చేస్తున్న వ్యాఖ్యలు, విలేకరుల సమావేశంలో ఇచ్చే సమాధానాలు చర్చనీయాంశంగా మారాయి.

Also Read : మతం మారితే రిజర్వేషన్ రద్దు..!

దీనిపై గంగూలి స్పందిస్తూ, మైదానంలో దూకుడుగా ఉండటం వేరు, బయట మర్యాదగా ఉండటం వేరు. మర్యాద ఇవ్వడంలో తప్పు లేదు, దాని వల్ల మనకు జరిగే నష్టం లేదన్నాడు. టీమిండియాను గంభీర్ సరైన దిశలో నడిపిస్తాడనే నమ్మకం తనకు ఉందని గంగూలీ చెబుతూనే, వ్యక్తిగత ప్రవర్తనలో మార్పులు చేసుకోవాలని సూచించాడు. ముఖ్యంగా జట్టులో ఆటగాళ్లతో సంబంధాలు మెరుగ్గా ఉండాలంటే కోచ్‌ గా కాస్త మృదువుగా ఉండటం అవసరమని దాదా పేర్కొన్నాడు. కోచ్‌ ప్రవర్తన సరిగ్గా లేకపోతే అది ప్రత్యర్థి జట్లకు, విమర్శకులకు ఆయుధంగా మారుతుందని గంగూలీ హెచ్చరించాడు. గంభీర్ తన ఫోకస్ అంతా ఆటపైనే పెట్టాలని, అనవసరమైన వివాదాలకు దూరంగా ఉంటే టీమిండియాకు మంచిదని సలహా ఇచ్చాడు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఇది జగన్ వ్యూహమా?...

స్థానిక సంస్థల ఎన్నికల్లో YSRCP వ్యవహరిస్తున్నతీరు...

స్థానిక సంస్థల ఎన్నికల...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల...

టీటీడీ పై విజయసాయిరెడ్డి...

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పునర్వ్యవస్థీకరణ,...

గాల్లోనే విమానంపై పడ్డ...

ఆకాశంలో ప్రయాణిస్తున్న ఒక విమానంలో ప్రయాణికులకు...

రాజకీయాల్లోకి యంగ్ హీరో...

తమిళనాట సినీ గ్లామర్‌కు, రాజకీయాలకు ఎప్పుడూ...

ప్లాస్టిక్ కరెన్సీ రెడీ.....

రూ.2 వేల నోట్లు ఇప్పుడు ఎక్కడా...

పోల్స్