Wednesday, March 25, 2026 08:36 AM
Wednesday, March 25, 2026 08:36 AM

కిమిడి సోదరుల మధ్య కుర్చీ పోరు..!

తెలుగు రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కుటుంబం కిమిడి. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాజకీయాల్లోకి వచ్చిన కిమిడి కళా వెంకట్రావు వరుసగా నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. టీటీడీ ఛైర్మన్‌గా, హోమ్ మంత్రిగా, పురపాలక శాఖ, వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా, తెలుగుదేశం పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులుగా కూడా కళా వెంకట్రావు పని చేశారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితునిగా కళా వెంకట్రావు గుర్తింపు తెచ్చుకున్నారు. 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీలో చేరినప్పటికీ.. ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత తిరిగి టీడీపీలోకి తిరిగి వచ్చేశారు. ఉత్తరాంధ్రలో సీనియర్ నేతగా కళా వెంకట్రావు పేరు.

Also Read : బోట్ల చోరీలో ఎంపీ హస్తం..? క్లారిటీ ఇచ్చిన బీద మస్తాన్‌..!

2009 ఎన్నికల్లో ఉణుకూరు నియోజకవర్గం రద్దు కావడంతో.. ఎచ్చెర్లకు మారిపోయారు కళా వెంకట్రావు. ప్రస్తుతం కళా వెంకట్రావు కుటుంబంలో సోదరుల మధ్య ఆధిపత్య పోరు చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇది టీడీపీ క్యాడర్‌ను ముక్కలు చేసేలా ఉందనే మాట బాగా వినిపిస్తోంది. ఇందుకు అన్నదమ్ముల పిల్లల మధ్య కుర్చీ కోసం గొడవ పెద్ద దుమారం రేపుతోంది. ఎవరికి సర్ది చెప్పాలో.. ఎవరితో ఉండాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో క్యాడర్ సతమతమవుతోంది.

1983 నుంచి తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న చీపురుపల్లి నియోజకవర్గం బొత్స రాకతో మారిపోయింది. 2004లో తొలిసారి బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2009లో రెండోసారి గెలిచారు. దీంతో చీపురుపల్లి అంటే బొత్స అడ్డా అన్నట్లుగా మారిపోయింది. ఇలాంటి చోట 2014లో బొత్సను ఓడించారు కిమిడి మృణాళిని. దీంతో ఆమెకు చంద్రబాబు క్యాబినెట్‌లో చోటు కూడా దక్కింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో మృణాళినికి బదులుగా ఆమె కుమారుడు నాగార్జున పోటీ చేసి బొత్స చేతుల్లో ఓడిపోయారు. నాటి నుంచి నియోజకవర్గం బాధ్యతలను నాగార్జున చూసుకున్నారు. అలాగే 2019లో ఎచ్చెర్ల నుంచి పోటీ చేసి ఓడిన కళా వెంకట్రావు ఎచ్చెర్ల నియోజకవర్గంపైనే ఫోకస్ పెట్టారు. అయితే అనూహ్యంగా పొత్తులో భాగంగా ఎచ్చెర్ల బీజేపీకి కేటాయించారు. దీంతో కళా వెంకట్రావును చీపురుపల్లికి మార్చేశారు చంద్రబాబు.

Also Read : శ్రీశైలం డ్యామ్ పునాదులు కదులుతున్నాయా..? రంగంలోకి దిగిన కేంద్రం..!

తనకే టికెట్ వస్తుందని గంపెడాశ పెట్టుకున్న నాగార్జున.. సొంత బాబాయ్‌కే టికెట్ రావడంతో.. పార్టీ ఆదేశానుసారం టీడీపీ గెలుపు కోసం నాగార్జున కృషి చేశారు. అయితే ఏడాదిన్నర కాలంగా చీపురుపల్లి నియోజకవర్గంలో అంతర్గత కుమ్ములాటలు పార్టీ పెద్దలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కళా వెంకట్రావు స్థానంలో ఆయన కుమారుడు కమిడి రామ్ మల్లిక్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో రామ్‌కు టికెట్ ఇవ్వాలని ఇప్పటి నుంచి ఆయన వర్గం నేతలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో నాగార్జున వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. పార్టీ కష్టంలో ఉన్నప్పుడు అండగా ఉండి ఐదేళ్లు నియోజకవర్గంలో ఉన్న నాగార్జునకే తిరిగి టికెట్ ఇవ్వాలనేది ఆయన వర్గం డిమాండ్. అదే సమయంలో నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలకు నాగార్జునను ఆహ్వానించటం లేదని గుర్రుగా ఉన్నారు. ఇదే విషయంపై పార్టీ పెద్దలకు కూడా ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో బొత్సకు బ్రేకులు వేస్తున్నామనే సంబరంలో ఉన్న టీడీపీ క్యాడర్.. ఇప్పుడు ఎవరి వైపు ఉండాలో అర్థం కాక తలలు పట్టుకుంటోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: డేంజర్ జోన్...

ఏపీలోని బెజవాడ నగరం వేదికగా సాగుతున్న...

బ్రేకింగ్: మాట నిలబెట్టుకున్న...

గత కొన్ని రోజులుగా విమర్శలు ఎదుర్కొంటున్న.....

ఏపీపై రైల్వే శాఖ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి...

బాబోయ్.. బెజవాడలో ఉగ్రవాదులు..!

విజయవాడ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విజయవాడలో...

బ్రేకింగ్: ఐటీ రంగంపై...

అమెరికా, ఇజ్రాయిల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం...

దానంపైనే బీఆర్ఎస్ గురి..?...

2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత.....

పోల్స్