Wednesday, May 6, 2026 08:34 PM
Wednesday, May 6, 2026 08:34 PM

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సంచలనం

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా ఉన్న ఫాం హౌస్ విషయంలో తెలంగాణా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో విచారణ ముమ్మరం చేసిన పోలీసులు మరియు రెవెన్యూ అధికారులు తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తోన్న బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌ ను అధికారులు సీజ్ చేశారు. మొయినాబాద్‌ లో జరిగిన డ్రగ్స్ పార్టీకి ఈ ఫామ్‌ హౌస్ వేదికైందన్న ఆరోపణలతో పోలీసులు ఇప్పటికే దాడులు నిర్వహించారు.

Also Read : షిర్డీ సాయిని వెంటాడుతున్న ఏబీవీ.. కోర్ట్ సంచలన ఆదేశాలు..!

అయితే, తాజాగా రెవెన్యూ అధికారుల విచారణలో మరో షాకింగ్ నిజం బయటపడింది. రోహిత్ రెడ్డి ఈ ఫామ్‌ హౌస్‌ ను అసైన్డ్ భూమిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినట్లు అధికారులు తేల్చారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి విలాసవంతమైన కట్టడాలు చేపట్టారన్న కారణంతో ఫామ్‌ హౌస్‌ను పూర్తిగా సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో రోహిత్ రెడ్డి పాత్రపై అనుమానాలు ఉన్న నేపథ్యంలో, పోలీసులు ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నట్లు సమాచారం. రోహిత్ రెడ్డిని నేరుగా సీజ్ చేసిన ఫామ్‌హౌస్‌కే తీసుకెళ్లి విచారించాలని పోలీసులు నిర్ణయించారు.

Also Read : యుద్ధంపై ట్రంప్ సంచలన కామెంట్స్.. ఇక ఆగినట్లే..?

అక్కడ జరిగిన పార్టీకి ఎవరెవరు వచ్చారు? డ్రగ్స్ ఎక్కడి నుండి సరఫరా అయ్యాయి? అనే కోణంలో సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేయనున్నారు. ఆ రోజు పార్టీకి హాజరైన ప్రముఖుల వాహనాలను కూడా పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఆ వాహనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఏమైనా ఉన్నాయా అన్నది క్లూస్ టీమ్ పరిశీలిస్తోంది. ఈ కేసులో ఇంకా ఎందరో సినీ, రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. పోలీసులు మరికాసేపట్లో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్