Thursday, September 24, 2026 12:49 PM
Thursday, September 24, 2026 12:49 PM

టీటీడీలో కమాండ్ కంట్రోల్.. అసలు ఎలా పని చేస్తుందంటే..?

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ పుట్టిన రోజు వేడుకలను తిరుమలలో ఘనంగా నిర్వహించింది నారా కుటుంబం. శ్రీవారి దర్శనం అనంతరం, తిరుమలలో అన్నదాన సత్రంలో చంద్రబాబు కుటుంబ సభ్యులు భక్తులకు అన్నదాన వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులతో మాడ వీధుల్లో చంద్రబాబు సహా కుటుంబ సభ్యులు భక్తులతో కలిసి కలియతిరిగారు. భక్తులతో ఫోటోలు కూడా తీసుకున్నారు. ఈ సందర్భంగా తిరుమలలో ఉన్న ఏర్పాట్లపై భక్తులను అడిగి తెలుసుకున్నారు.

Also Read : హిందూ మహాసముద్రంలోకి అడుగుపెట్టిన యుద్ధం..?

ఇక భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శన భాగ్యం కలిగేందుకు, రద్దీ నియంత్రణ కోసం తీసుకువచ్చిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని చంద్రబాబు నాయుడు సందర్శించారు. భక్తులకు వేగంగా శ్రీవారి దర్శనం జరిగేలా ఈ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని సమర్థంగా నిర్వహించాలని సిఎం సూచించారు. ప్రపంచంలోనే ఎక్కువ మంది భక్తులు దర్శించే పుణ్య క్షేత్రం కావడంతో జనసాంద్రత, దర్శన‑సమయాలను సమర్థంగా నిర్వహించేలా కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేసింది టీటీడీ.

Also Read : బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సంచలనం

ఏఐ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా జనసాంద్రత, దర్శనం కొసం వేచి ఉండే సమయం, వాహన చలనం, వసతి, సీసీటీవీ వాతావరణం, వైద్య అత్యవసరాలు అన్నీ ఒకే ప్లాట్‌ఫారం ద్వారా రియల్ టైమ్‌ లో పర్యవేక్షణ ఉంటుంది. ఏఐ ఆధారిత విశ్లేషణ ద్వారా రద్దీ పెరిగే పరిస్థితులను ముందే అంచనా వేసి క్యూ మేనేజ్మెంట్ సమర్థంగా నిర్వహించేందుకు ఆస్కారం ఉంటుంది. ఐటీ శాఖ మంత్రి లోకేష్ చొరవతో టీటీడీలో కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని ఇతర ప్రముఖ ఆలయాలకు కూడా ఈ కమాండ్ కంట్రోల్ స్పూర్తిగా నిలుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

భోగాపురంలో కంగారుపెట్టిన విమానం..!

విజయవాడ నుంచి భోగాపురం బయలుదేరిన ఎయిర్...

టీచర్లను కొట్టినా 24...

విజయవాడ శాప్ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ...

పిఠాపురంలో పవన్ మార్క్.....

పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఉప...

శీనన్న.. ఇలా అడ్డంగా...

తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా ఉన్నాయి....

ఖైరతాబాద్.. గులాబీ పార్టీకి...

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత...

ఏపీ పోలీసులకు జగన్...

రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల...

పోల్స్