Thursday, September 17, 2026 07:40 PM
Thursday, September 17, 2026 07:40 PM

తగ్గని పిన్నెల్లి వాయిస్.. ఈ వార్నింగ్ ఎవరికి..?

పల్నాడు రాజకీయాల్లో అత్యంత వివాదాస్పదమైన గుండ్లపాడు జంట హత్యల కేసులో ఏ-6 నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. గురజాల కోర్టు నిన్న ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో, ఈరోజు ఆయన నెల్లూరు జిల్లా జైలు నుండి విడుదలయ్యారు. అయితే, ఆయన విడుదల మాచర్లలో చర్చనీయంశంగా మారింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుండి బయటకు రాగానే ఆయన అనుచరులు, వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Also Read : ఏపీకి పండగొచ్చింది.. బాబు సర్కార్‌ ఉగాది వరాలు

అయితే, పల్నాడు ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా మాచర్ల పట్టణంలో 144 సెక్షన్ విధించారు. జైలు నుండి విడుదలైన అనంతరం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. గుండ్లపాడు జంట హత్యల కేసుతో మాకు ఎలాంటి సంబంధం లేదని.. కావాలనే మమ్మల్ని టార్గెట్ చేసి, ఉద్దేశపూర్వకంగా ఈ కేసులో ఇరికించారని మండిపడ్డారు. ఈ కుట్రల వెనుక ఉన్నవారు ఎవరో మాకు తెలుసు అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు.

Also Read : మూవీ రివ్యూ : దురంధర్: ది రివెంజ్

మమ్మల్ని జైలుకు పంపిన వారందరికీ మాకూ ఒక రోజు వస్తుందని, ఆ రోజు వచ్చినప్పుడు ఎవరినీ వదిలిపెట్టం అంటూ అధికార పార్టీ లక్ష్యంగా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇప్పటికే అరెస్ట్ అయిన వైసీపీ నేతలు అందరూ ఇదే తరహాలో దూకుడుగా వ్యాఖ్యలు చేయడం, తాజాగా పిన్నెల్లి కూడా అదే తరహా వ్యాఖ్యలు చేసారు. దీనితో వైసీపీ క్యాడర్‌లో కొత్త ఉత్సాహం వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఆయన చేసిన రివెంజ్ వ్యాఖ్యలు రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్