Friday, June 19, 2026 05:01 AM
Friday, June 19, 2026 05:01 AM

అగార్కర్ పదవీ కాలం పొడిగిస్తారా..?

టీం ఇండియా చీఫ్ సెలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి, జట్టులో కీలక మార్పుల కోసం ప్రయత్నం చేస్తూ వస్తోన్న, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కార్.. పదవీ కాలంపై ఇప్పుడు సందిగ్దత నెలకొంది. అజిత్ అగార్కర్ తన పదవీకాలాన్ని 2027 వన్డే ప్రపంచ కప్ వరకు పొడిగించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ)ని కోరాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2024 టీ20 ప్రపంచ కప్ గెలిచినందుకు ప్రతిఫలంగా, ఐపీఎల్ 2025కు కొద్ది రోజుల ముందు అగార్కర్ కాంట్రాక్టును ఏడాది పాటు పొడిగించారు.

Also Read : మూవీ రివ్యూ : దురంధర్: ది రివెంజ్

అతని అభ్యర్థనపై చర్చలు జరుగుతున్నాయని, అయితే ఇప్పటివరకు ఎటువంటి ఖచ్చితమైన నిర్ణయం వెలువడలేదని జాతీయ మీడియా పేర్కొంది. అగార్కర్ వారసుడిగా ఈస్ట్ జోన్ కు చెందిన మరో మాజీ భారత క్రికెట్ జట్టు ఆటగాడు ముందున్నట్లు వార్తలు వచ్చినా, ఆ విషయంలో క్లారిటీ రాలేదు. టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత వెంటనే బోర్డుకు ఈ అభ్యర్థన రావడంతో, దీనిపై ఆసక్తి నెలకొంది. గత మూడేళ్లలో, భారత జట్టు నాలుగు ఐసీసీ ఫైనల్స్ ఆడింది. 2023 వన్డే ప్రపంచ కప్, 2024 టీ20 ప్రపంచ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 ప్రపంచ కప్ ఆడింది.

Also Read : కవిత పార్టీ పేరు ఇదే..? పొలిటికల్ రీ-ఎంట్రీకి రెడీ..!

వాటిలో మూడు గెలిచి, ఒకదానిలో ఓడిపోయింది. ఇటీవల భారత్ టి20 ప్రపంచకప్ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే అజిత్ అగార్కర్ విషయంలో పలు విమర్శలు ఉన్నాయి. హార్దిక్ పాండ్యాను కాదని, సూర్య కుమార్ యాదవ్ ను కెప్టెన్ గా ఎంపిక చేయడంపై విమర్శలు వచ్చాయి. అలాగే గిల్ ను పూర్తి స్థాయి కెప్టెన్ గా మార్చే ప్రయత్నం అగార్కర్ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. టెస్ట్ క్రికెట్ విషయంలో అగార్కర్ విమర్శలు ఎదుర్కొన్నాడు. అభిమన్యు ఈశ్వరన్, సర్ఫరాజ్ ఖాన్, షమీలను జట్టు నుంచి తప్పించడంపై విమర్శలు ఉన్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో...

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా...

ప్రజల్లోకి వెళ్ళాల్సిందే.. చంద్రబాబు...

ఏపీలో అధికారుల తీరుపై విమర్శలు వస్తున్న...

బ్రేకింగ్: లోకేష్ సంచలన...

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుర్చీలో...

భయపడాల్సిన వారేమో భయపెడుతున్నారు.. భయపెట్టాల్సిన వారేమో...

పోల్స్