Wednesday, March 11, 2026 10:30 PM
Wednesday, March 11, 2026 10:30 PM

నేతన్యాహు ఎక్కడ..? చంపేసాం అంటున్న ఇరాన్..!

పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధం రోజు రోజుకు తీవ్రమవుతున్న సమయంలో వస్తున్న వార్తలు ఇప్పుడు ప్రపంచాన్ని నివ్వెర పరుస్తున్నాయి. తాజాగా ఓ వార్త ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. అదే ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నేతన్యాహు మరణించారు అనే వార్త. గత నెల చివర్లో యుద్ధం ప్రారంభం కాగా.. తొలి రోజునే.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఇజ్రాయిల్ బలగాలు హతమార్చాయి. ఆ తర్వాతి నుంచి ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతుంది. ఆ తర్వాతనే ఇజ్రాయిల్ ప్రధాని నివాసంపై దాడులకు కూడా దిగింది అనే కథనాలు వచ్చాయి.

Also Read : జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా.!

ఆ తర్వాత ఇరాన్ మిలిటరీ సోషల్ మీడియా ఖాతాల్లో కూడా దీనికి సంబంధించి పలు పోస్ట్ లు, ఫోటోలు కనిపించాయి. ఇక ఇప్పుడు ఇరాన్ కు సంబంధించిన మీడియా చానల్స్ ఓ సంచలన కథనం ప్రసారం చేసాయి. ఇజ్రాయిల్ ప్రధాని ఇక లేరు అంటూ ఇరాన్ మీడియా పేర్కొంది. అయితే దీనిపై ఇజ్రాయిల్ మీడియా గాని, అమెరికన్ మీడియా గానీ ఎక్కడా కూడా కథనాలు ప్రసారం చేయడం లేదు. ఏం జరుగుతుందో కూడా క్లారిటీ రాని పరిస్థితి. సాధారణంగా ఇజ్రాయిల్ లో మీడియాపై సెన్సార్ ఉంటుంది.

Also Read : ఏపీ పంచాయతీల్లో విప్లవాత్మక మార్పు

అందుకే ఏ విషయం బయటకు రావడం లేదనే కథనాలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా జరిపిన దాడుల్లో ఇజ్రాయిల్ కేంద్ర మంత్రితో పాటుగా ప్రధాని సోదరుడు ఇద్దో కూడా మరణించారు అంటూ వార్తలు వస్తున్నాయి. యుద్ధం మొదలైన ప్రారంభ రోజుల్లో కనపడిన నేతన్యాహు ఆ తర్వాత నుంచి మాత్రం పెద్దగా కనపడటం లేదు. ఆయన పేరు మీద వస్తున్న ప్రకటనలు గాని, హెచ్చరికలు గానీ అన్నీ కూడా వ్రాత పూర్వకంగానే ఉన్నాయి మినహా.. వీడియోలు లేవు. ఇజ్రాయిల్ గానీ, అమెరికా గానీ రియాక్ట్ అయితే మాత్రమే దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సీఎం.. ముహూర్తం...

​బీహార్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్...

బ్రేకింగ్: పాదయాత్రకు సిద్దమవుతోన్న...

తెలంగాణలో భారత రాష్ట్ర సమితిని తిరిగి...

హైదరాబాద్ హాస్టల్స్ కష్టాలు.....

దేశ వ్యాప్తంగా ఎల్ పీ జీ...

పెంచలయ్య సరే.. మరి.....

తిరుమల పరకామణిలో బంగారం, వెండి అపహరణకు...

రైతన్నలకు సిఎం చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో సిఎం చంద్రబాబు...

దానంకు క్లీన్ చిట్.....

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు...

పోల్స్