Friday, June 19, 2026 03:17 PM
Friday, June 19, 2026 03:17 PM

ఆ సినిమాలకు అవార్డుల పంట..!

తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది గద్దర్ అవార్డులను ప్రకటించింది. అవార్డులు నిష్పాక్షికంగా, నిజమైనవని, పూర్తిగా ప్రతిభ ఆధారంగా ఉన్నాయనే మాట టాలీవుడ్‌లో బాగా వినిపిస్తోంది. గతేడాది నంది అవార్డుల ప్రకటనను పోల్చితే.. ఈ ఏడాది ప్రతిభకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారని సినీ విమర్శకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాదరణ కంటే.. నిజమైన నైపుణ్యానికి గుర్తింపు లభించిందని వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read : టీం ఇండియాకు నల్ల మట్టి భయం..?

ఉత్తమ నటుడి అవార్డును నాగ చైతన్య, ఉత్తమ నటిగా రష్మిక గెలుచుకున్నారు. తండేల్ చిత్రానికి నాగ చైతన్య, గర్ల్ ఫ్రెండ్ సినిమాకు రష్మిక అవార్డులు గెలుచుకున్నారు. ఇక ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్ రాంబాయ్, ఉత్తమ రెండవ చిత్రంగా దండోర, ఉత్తమ మూడవ చిత్రంగా ది ప్రీ – వెడ్డింగ్ షో సినిమాలు అవార్డులను అందుకున్నాయి. తండేల్ సినిమా జాతీయ సమగ్రత చిత్ర అవార్డును కూడా గెలుచుకుంది.
ఇతర విభాగాలలో లిటిల్ హార్ట్స్ ఉత్తమ తొలి ఫీచర్ ఫిల్మ్‌ను గెలుచుకోగా, సంక్రాంతికి వస్తున్నాం ఉత్తమ వినోదాత్మక చిత్రంగా అవార్డు అందుకుంది. ఉత్తమ సామాజిక సందేశ చిత్రంగా ప్రియదర్శి, శివాజీ నటించిన కోర్టు ఎంపికైంది. మిరాయ్ సినిమా ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డును గెలుచుకుంది.

Also Read : చంద్రబాబు ఖాతాలో మరో రికార్డ్.. ఫస్ట్ ఛాన్స్ చంద్రబాబుకే..!

మొత్తం మీద అవార్డుల ఎంపికను అత్యంత పారదర్శకంగా నిర్వహించారనే మాట బాగా వినిపిస్తోంది. ఈ ఏడాది అవార్డుల ప్రకటన అనంతరం చలనచిత్ర సంఘం నుండి చాలా తక్కువ అభ్యంతరాలు వచ్చాయి. స్పెషల్ జ్యూరీ అవార్డుల ఎంపికపై ఎలాంటి విమర్శలు తలెత్తలేదు. ఉత్తమ స్పెషల్ జ్యూరీ చిత్రంగా 23 ఎంపికైంది. చైతన్య జొన్నలగడ్డ రాజు వెడ్స్ రాంబాయ్ చిత్రానికి ఉత్తమ నటుడిగా, అనంతిక 8 వసంతాలు చిత్రానికి ఉత్తమ నటిగా, ఛాంపియన్ చిత్రానికి ప్రత్యేక జ్యూరీ హీరో అవార్డును రోషన్ దక్కించుకున్నాడు. మొత్తం మీద, ఛాంపియన్, రాజు వెడ్స్ రాంబాయ్, మిరాయ్ వంటి చిత్రాలు ఈ సంవత్సరం అత్యధిక సంఖ్యలో అవార్డులు గెలుచుకున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో...

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా...

పోల్స్