Friday, September 18, 2026 12:15 AM
Friday, September 18, 2026 12:15 AM

చంద్రబాబు ఖాతాలో మరో రికార్డ్.. ఫస్ట్ ఛాన్స్ చంద్రబాబుకే..!

పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో ఏపీ సిఎం చంద్రబాబు చాలా స్పీడ్ గా ఉంటారు. ఏ ఛాన్స్ వచ్చినా సరే వదులుకునే అవకాశమే ఉండదు అనే మాట మనం వింటూనే ఉంటాం. తాజాగా సిఎం చంద్రబాబు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్ళారు. ‘రైసినా డైలాగ్’ సదస్సుకు సీఎం చంద్రబాబు హాజరు అయ్యారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ – అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న తొలి సిఎంగా చంద్రబాబు రికార్డ్ సృష్టించారు.

Also Read : ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు ఉన్న టాప్ 10 దేశాలు ఇవే

ఈ నిర్వాహకులు కూడా ఏ సిఎంకు ఆహ్వానం పలకకుండా కేవలం చంద్రబాబుకే పలకడం గమనార్హం. 2016 నుంచి నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సదస్సులో తొలిసారిగా సిఎంను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి 110 దేశాల నుంచి 2,700 మందికి పైగా ప్రతినిధులు, మేధావులు, నిపుణులు, వ్యూహకర్తలు హాజరు అయ్యారు. ఈ సదస్సుకు కేంద్రం నుంచి.. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ సహా ఇతర ప్రతినిధులు హాజరు అయ్యారు. ఇక సిఎం చంద్రబాబు కామెంట్స్ ఒకసారి చూస్తే, దేశంలో అభివృద్ధి వేగంగా విస్తరిస్తోందన్నారు.

Also Read : బ్రేకింగ్: భారత్ కు ఘోర అవమానం

కొత్త సాంకేతిక ఆవిష్కరణలు వస్తున్నాయని, ఐటీని మొదటి అడ్వాంటేజ్‌గా తీసుకున్నాం.. ఏఐ విషయంలోనూ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అని పేర్కొన్నారు. ఏఐ, డేటా సెంటర్లతో ఐటీ డెస్టినేషన్‌గా ఏపీ తయారవుతోందన్నారు సిఎం. సంస్కరణల వల్లే మన దేశం అభివృద్ధి చెందుతుందని, ఐటీలో భారతీయుల పరిజ్ఞానం అందరికీ తెలిసిందేనన్నారు చంద్రబాబు. డిప్లమసీ, ఫ్లెక్సిబిలిటీ విషయాల్లో భారతీయులకు మంచి పేరుందని, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి దిశగా భారత్ దూసుకెళ్తోందని తెలిపారు. మన దేశం భవిష్యత్తులో అనేక దేశాలకు విద్యుత్ సరఫరా చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్