Friday, September 18, 2026 02:03 AM
Friday, September 18, 2026 02:03 AM

టీం ఇండియాకు నల్ల మట్టి భయం..?

ఎలాగోలా టీం ఇండియా.. టి20 వరల్డ్ కప్ లో ఫైనల్ కు చేరింది..? మరి ఫైనల్ లో భారత్ గెలుస్తుందా లేదా అనే దానిపై అనేక అనుమానాలు ఉన్నాయి. కారణం అహ్మదాబాద్ లో మ్యాచ్ లు భారత్ కు ఎప్పుడూ ప్రతికూలమే కాబట్టి. 2023 వన్డే వరల్డ్ కప్ ఓడిపోయింది ఇక్కడే. ఇక ఇప్పుడు న్యూజిలాండ్ తో ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. ఒకరకంగా చూసుకుంటే న్యూజిలాండ్ కంటే భారత్ ఇక్కడ బలహీనంగా కనపడుతోంది అనే మాట వినపడుతోంది. మరి పిచ్ కండీషన్ ఏంటీ..? ఎలాంటి పరిస్థితి ఉందో ఒకసారి చూద్దాం.

Also Read : మన వంట గదిపై.. ఇరాన్ – ఇజ్రాయిల్ వార్ ప్రభావం..!

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం.. కాస్త డిఫరెంట్ పిచ్ నే రెడీ చేస్తున్నారు. దాదాపుగా ముంబైలో ఉన్న రెడ్ సాయిల్ పిచ్ మాదిరిగానే ఇది కూడా ఉంది. కాకపోతే ఈ పిచ్ కోసం కాస్త నల్ల మట్టిని కూడా కలిపి తయారు చేసినట్టు తెలుస్తోంది. అహ్మదాబాద్ పిచ్ స్పిన్ బౌలర్ లకు బాగా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక బ్యాటింగ్ పరంగా చూస్తే పరుగుల వర్షమే అంటున్నాయి క్రికెట్ వర్గాలు. సెంటర్ పిచ్ ఎరుపు, నల్ల మట్టితో ఉంది.

Also Read : బ్రేకింగ్: భారత్ కు ఘోర అవమానం

బౌలర్లకు మంచి బౌన్స్‌ రాబట్టేందుకు అవకాశం దొరుకుతుంది. ఇక 200 పై స్కోర్ లు నమోదు అయ్యే అవకాశం ఉంది. అయితే పిచ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వెనుక కారణం కూడా వేరే ఉంది. రెండు కీలకమైన మ్యాచ్‌ల్లో భారత్ ఇక్కడ ఓడిపోవడంతో.. నల్ల మట్టి కంటే ఎర్ర మట్టి ఎక్కువగా ఉన్న వికెట్‌ ను ఎంచుకున్నట్లు సమాచారం. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌ లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి పాలైనది నల్ల మట్టి పిచ్‌పై. ఈ పిచ్ బ్యాటింగ్ కు కష్టంగా ఉంటుంది. ఈ టోర్నీలో భారత్ సఫారీలపై 70 పరుగుల తేడాతో ఓడిపోయింది నల్ల మట్టి పిచ్ పైనే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్