Saturday, February 28, 2026 03:47 AM
Saturday, February 28, 2026 03:47 AM

ఆయనకే సీఎంఓలో కీలక బాధ్యతలు..!

సీఎంఓలోకి ఏపీ సీఎస్ విజయానంద్ రాబోతున్నారా.. ? ఇప్పుడు ఇదే చర్చ జోరుగా జరుగుతోంది. ఫిబ్రవరి నెలాఖరున పదవీ విరమణ చేస్తున్నారు విజయానంద్. అయితే ఈయన సేవలు ఇంకా వినియోగించుకోవాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన అంటున్నారు ఆయన సన్నిహితులు. అందుకే విజయానంద్‌ను సీఎంఓలో ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించి.. ఆయనకు ఎనర్జీ శాఖను పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇంకా చెప్పాలంటే.. ఎనర్జీ శాఖను విజయానంద్‌కు కేటాయించాలని వైసీపీ అభిమాని, వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహుతుడు, షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ అధినేత, కడప జిల్లాకు చెందిన విశ్వేశ్వర రెడ్డి ఒత్తిడి తెస్తున్నట్లు కూడా జోరుగా చర్చ నడుస్తోంది.

Also Read : బ్రేకింగ్: లిక్కర్ కేసులో కవిత సేఫ్..!

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ శాఖ కాంట్రాక్టుల ద్వారా వందల కోట్లు విలువైన కాంట్రాక్టులను షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ అధినేత విశ్వేశ్వర రెడ్డికి ఇచ్చారనేది అప్పట్లోనే టీడీపీ నేతలు ఆరోపించారు. టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణ రెడ్డి అయితే.. రుజువులతో సహా ఎన్నోసార్లు ప్రెస్ మీట్ పెట్టారు. అలాంటి విశ్వేశ్వర రెడ్డికి విజయానంద్ సన్నిహితులు అనేది బహిరంగ రహస్యం. ఎన్నికలకు ముందు కోట్ల రూపాయలను ఎన్నికల ఫండ్ రూపంలో రాజకీయాలు పార్టీలకు విశ్వేశ్వర రెడ్డి సాయం చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్ శాఖ నిర్వహించిన విజయానంద్.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పోస్టులో కొనసాగారు.

విశ్వేశ్వర రెడ్డి ఒత్తిడి వల్లే జూనియర్ అయినప్పటికీ.. విజయానంద్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి వచ్చిందని అప్పట్లోనే పెద్ద ఎత్తున పుకార్లు షికారు చేశాయి. అంతే కాదు ఎనర్జీ శాఖను కూడా సీఎస్ హోదాలో నిర్వహించిన ఘనత కూడా విజయానంద్‌కే దక్కింది. ఇప్పుడు విజయానంద్ రిటైర్డు అయితే.. ఆయన స్థానంలో నియమితులైయ్యే ఐఏఎస్ అధికారి గట్టి వాడైయితే..? తన వ్యాపార గుట్టు మొత్తం బయటపడుతుందని షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ అధినేత బయపడుతున్నారనేది సచివాలయ వర్గాల సమాచారం. వైసీపీ ప్రభుత్వ హయాంలో వందల కోట్లు అక్రమంగా సంపాధించుకున్నా కూడా కూటమి ప్రభుత్వం విచారణ జరిపించటం లేదని.. పట్టించుకోలేదని.. టీడీపీ నేతలే విమర్శలు చేస్తున్నారు కూడా.

Also Read : సెన్సార్ బోర్డుకు మైండ్ లేదా..? హైకోర్ట్ సంచలన కామెంట్స్..!

నిజానికి ఇదే విషయంపై రిటైర్డు ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు బాహాటంగానే ఆరోపణలు చేసినా కూటమి ప్రభుత్వ పాలకులు కానీ, విద్యుత్ శాఖ మంత్రి కానీ ఖండించలేదు. ఏబీవీ ఆరోపణలలో నిజాలు ఉన్నాయని స్పష్టమవుతోంది. ఈ శాఖ ఇప్పటికీ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ అధినేత విశ్వేశ్వర రెడ్డి అదుపులోనే ఉందనే ప్రచారం ఉంది. ఆ ప్రచారంలో నిజం లేకపోలేదని విద్యుత్ శాఖ అధికారులే ఆఫ్ ది రికార్డుగా కామెంట్‌లు చేస్తున్నారు. ఇప్పుడు విజయానంద్ రిటైర్ అయితే ఎక్కడ తన అక్రమ సంపాదన బాగోతాలు బయట పడతాయో అనే “దురా” లోచనతో విజయానంద్‌కే ఎనర్జీ శాఖ పర్యవేక్షణ ఉండాలనే విశ్వేశ్వర రెడ్డి తెగ ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. విజయానంద్‌ను సీఎంఓ ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించితేనే సాధ్యపడుతుందని విశ్వేశ్వర రెడ్డి భావన కూడా అంట. ఇప్పటికీ జగన్ రెడ్డికి అందుబాటులోనే విశ్వేశ్వర రెడ్డి ఉన్నారనేది బహిరంగ రహస్యం. అందుకేనేమో ఆయనను చిరంజీవి సినిమా “అందరివాడు “అనీ కూడా పొలిటికల్ సర్కిల్ అంటున్నారు..!

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బీఆర్ఎస్, బిజెపిలకు బులెట్...

గత నాలుగేళ్ల నుంచి సంచలనంగా మారిన...

అన్న వాకింగ్ అంటే.....

"మరో ఏడాదిన్నరలో నా పాదయాత్ర మొదలవుతుంది."...

పయ్యావుల వర్సెస్ మండలి...

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో రాజకీయం హాట్...

బ్రేకింగ్: లిక్కర్ కేసులో...

నాలుగేళ్ల క్రితం దేశ వ్యాప్తంగా సంచలనం...

నా భర్తను పరిచయం...

విజయ్‌ దేవరకొండ, రష్మిక మూడు ముళ్ల...

పెద్దల సభ కు...

తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ...

పోల్స్