Friday, June 19, 2026 11:57 AM
Friday, June 19, 2026 11:57 AM

భారత్ వచ్చేయండి.. స్టూడెంట్స్, టూరిస్ట్ లకు కేంద్రం వార్నింగ్..!

ఇరాన్ – అమెరికా దేశాల మధ్య యుద్ద వాతావరణం తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపధ్యంలో మధ్యప్రాచ్య దేశాలలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటు అన్ని దేశాలు తమ పౌరుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. రాబోయే రోజుల్లో అమెరికా దాడులకు పాల్పడే అవకాశం ఉన్నందున ఇరాన్‌లోని భారత పౌరులు అక్కడి నుంచి స్వదేశానికి రావాలని విదేశాంగ శాఖ సూచించింది. భారత రాయబార కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పలు హెచ్చరికలు చేసింది.

Also Read : అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు..!

వాణిజ్య విమానాలు సహా అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా ఇరాన్‌ ను విడిచి వెళ్లాలని తన పౌరులను కోరింది. ఈ సలహా ఇరాన్‌లోని ప్రతి ఒక్కరికీ వర్తిస్తుందని తెలిపింది. విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులు అందరూ దేశానికి తిరిగి రావాలని సూచించింది. జనవరి 14, 2026 నాటి సలహా ప్రకారం, భారత పౌరులు, భారత సంతతికి చెందిన వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, నిరసనలు లేదా ప్రదర్శనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది.

Also Read : భారత్ సెమీస్ చేరాలంటే.. ఇది జరగాల్సిందే..!

ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించి క్షేమంగా ఉండాలని తెలిపింది. స్థానిక మీడియాను చూసి ఎప్పటికప్పుడు వార్తలు తెలుసుకోవాలని కోరింది. ఇరాన్‌ లోని భారతీయులు తమ ప్రయాణ, ఇమ్మిగ్రేషన్ పత్రాలు, పాస్‌పోర్ట్‌లు, గుర్తింపు పత్రాలు సహా, ప్రతీ ఒక్కటి అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. భారత రాయబార కార్యాలయం అత్యవసర నంబర్లు, ఇమెయిల్‌లను కూడా ప్రకటించింది. +989128109115; +989128109109; +989128109102; +989932179359. ఇమెయిల్: cons.tehran@mea.gov.in ఇరాన్‌లోని భారత పౌరులు.. భారత రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోవాలని కోరింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో...

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా...

ప్రజల్లోకి వెళ్ళాల్సిందే.. చంద్రబాబు...

ఏపీలో అధికారుల తీరుపై విమర్శలు వస్తున్న...

బ్రేకింగ్: లోకేష్ సంచలన...

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి...

పోల్స్