Monday, August 3, 2026 05:24 PM
Monday, August 3, 2026 05:24 PM

భారత్ సెమీస్ చేరాలంటే.. ఇది జరగాల్సిందే..!

టి20 వరల్డ్ కప్ లో ఎలాగోలా లీగ్ దశ దాటిన టీం ఇండియా.. ఇప్పుడు సూపర్ 8 పోరులో అడుగుపెట్టే సమయానికి చుక్కలు చూసింది. చిన్న జట్లపై సాధించిన విజయాలతో.. బలంగా కనపడిన భారత జట్టు.. సౌత్ ఆఫ్రికాతో జరిగిన పోరులో తేలిపోయింది. టీం ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ లో లోపాలు స్పష్టంగా బయటపడ్డాయి. టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే.. ఎవరో ఒక ఆటగాడు ఆడి.. జట్టును లీగ్ దశలో గెలిపించాడు. కానీ సఫారీల బౌలింగ్ దెబ్బకు.. మన బ్యాటింగ్ ఎంత బలహీనంగా ఉందో తేలిపోయింది.

Also Read :విరోష్ పెళ్లి అక్కడే.. అతిధులు వీళ్ళే..!

రాబాడా, లుంగీ ఎంగిడి, యన్సేన్ బౌలింగ్ ధాటికి భారత్ విలవిలలాడింది. మరి భారత్ సెమీస్ చేరాలంటే ఏం జరగాలి..? ఈ ఓటమి ఫలితంగా.. భారత్.. వెస్టిండీస్, జింబాబ్వేలతో జరిగే మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలవాలి. తద్వారా పోటీలో ఫైనల్ 4లో తన స్థానాన్ని ఖాయం చేసుకోవచ్చు. ఒక మ్యాచ్ గెలిస్తే మాత్రం ఇతర జట్ల ఫలితాలు, రన్ రేట్ మీద ఆధారపడాల్సి ఉంటుంది. భారత్ రెండు మ్యాచ్ లు గెలిస్తే 4 పాయింట్ లతో సెమీస్ కు వెళ్తుంది. మరో రెండు జట్లు కూడా 4 పాయింట్లు సాధించకపోతే సెమీఫైనల్‌కు చేరుకోవడానికి ఇది సరిపోతుంది.

Also Read :బ్రేకింగ్: గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేష్..!

ఇక సఫారీలు తదుపరి మ్యాచ్ లలో ఒకటే గెలిస్తే.. భారత్ కు రన్ రేట్ కీలకం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక భారత్ ఒక మ్యాచ్ లో మాత్రమే గెలిస్తే ఇబ్బందులు తప్పేలా లేవు. భారత్ ఒక మ్యాచ్ గెలిస్తే.. సఫారీలు తమ రెండు మ్యాచ్ లు కూడా గెలవాల్సి ఉంటుంది. వెస్టిండీస్-జింబాబ్వే మ్యాచ్ లో గెలిచిన జట్టుపై భారత్ విజయం సాధించాల్సి ఉంటుంది. అప్పుడు భారత్, జింబాబ్వే, వెస్టిండీస్ లకు చెరో 2 పాయింట్లు ఉంటాయి. అప్పుడు రన్ రేట్ ఇక్కడ కీలకం అయ్యే అవకాశం ఉంది. ఇలా కాకుండా.. భారత్ వెస్టిండీస్, జింబాబ్వే మీద భారీ తేడాతో గెలిస్తే ఇబ్బంది ఉండకపోవచ్చు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఉరవకొండలో పొలిటికల్ హీట్.....

ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాజకీయ వాతావరణం...

ఉత్తరాంధ్ర కాదు.. ఇక...

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి...

ఇదీ ఉత్తరాంధ్ర దెబ్బ.....

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ...

మోడీని దారుణంగా మాట్లాడారు.....

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ...

భోగాపురంలో చరిత్ర సృష్టించిన...

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమవుతూ,...

అంతర్జాతీయ అద్భుతం.. మన...

విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా...

పోల్స్