Monday, August 3, 2026 09:33 AM
Monday, August 3, 2026 09:33 AM

విరోష్ పెళ్లి అక్కడే.. అతిధులు వీళ్ళే..!

గతంలో ఓ సామెత ఉండేది.. ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి.. నేటి సామెత సెలెబ్రెటీల పెళ్ళికి సోషల్ మీడియా హడావుడి. ఎస్.. ఏ పెళ్లి జరిగినా, విడాకులు జరిగినా.. పంతులు గారు, లాయరు గారి కంటే సోషల్ మీడియాలో ఉండే సందడి ఓ లెవెల్ లో ఉంటుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్ళికి ఇలాగే హడావుడి నడుస్తోంది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఈ పెళ్లి జరగనుంది. దీనిపై తాజాగా ఇద్దరూ ప్రకటన కూడా చేసారు. ఇద్దరి ప్రేమ వ్యవహారం స్టార్ట్ అయిన తర్వాత ఇదే తొలి అధికారిక ప్రకటన.

Also Read : బరువు తగ్గే వాళ్ళు ప్రోటీన్ ఎప్పుడు తీసుకోవాలి..?

ఇక ఈ పెళ్లి ఎక్కడో ఇప్పటికే తెలిసిందే. ఇక రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ వివాహానికి ముందే.. ఉదయపూర్ విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉదయపూర్ వెలుపల 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐటీసీ మెమెంటోస్‌ లో ఈ వేడుక జరగనుంది. ఆరావళి పర్వతాలలో ఉన్న ఈ రిసార్ట్, ప్రైవేట్ వేడుకలకు అనుకూలంగా ఉంటుంది. ఈ హోటల్‌ లో 117 ప్రైవేట్ విల్లాలు ఉన్నాయి. ఎస్టేట్ లోపల ఒక నది, సరస్సు కూడా ఉండటం విశేషం. స్వంత ప్రైవేట్ హెలిప్యాడ్ కూడా ఉంది.

Also Read : స్టేజి పైనే వరలక్షి శరత్ కుమార్ కన్నీటి కృతజ్ఞత

వేడుకలు ప్రారంభమయ్యే ముందు.. ఈ జంట దాదాపు 50 మంది అత్యంత సన్నిహితులతో.. ఓ విమానంలో ఉదయపూర్ విమానాశ్రయంలో దిగనున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకకు అనేక మంది ప్రముఖులు వచ్చే అవకాశం ఉన్న నేపధ్యంలో విమానాశ్రయ భద్రతను పెంచారు. సినీ ప్రముఖులు ఎవరూ హాజరు కానప్పటికీ, తెలంగాణకు చెందిన కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది సినీ దర్శకులు ఆహ్వానితుల జాబితాలో ఉన్నారు. అతిధుల సంఖ్య దాదాపు 100 మంది వరకు ఉండే ఛాన్స్ ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఉత్తరాంధ్ర కాదు.. ఇక...

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి...

ఇదీ ఉత్తరాంధ్ర దెబ్బ.....

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ...

మోడీని దారుణంగా మాట్లాడారు.....

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ...

భోగాపురంలో చరిత్ర సృష్టించిన...

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమవుతూ,...

అంతర్జాతీయ అద్భుతం.. మన...

విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా...

భోగాపురం భోగం ఎవరిది.....

మరికొన్ని గంటల్లో విజయనగరం జిల్లా భోగాపురంలో...

పోల్స్