Wednesday, July 8, 2026 12:09 AM
Wednesday, July 8, 2026 12:09 AM

మోహన్ బాబు అరెస్ట్ తప్పదా..?

గత కొన్నాళ్ళుగా ఇబ్బందులు పడుతోన్న మంచు కుటుంబం మరోసారి చిక్కుల్లో పడింది. తాజాగా హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలతో మోహన్ బాబు కుటుంబానికి ఇబ్బందులు తప్పేలా కనపడటం లేదు. సీనినటుడు మోహన్ బాబుకు క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కిడ్నాప్ కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్ట్ నిరాకరించింది. క్వాష్ పిటిషన్ పై విచారణ మార్చి 3కు వాయిదా వేసింది. విద్యార్ది నాయకుల కిడ్నాప్ కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేసారు మోహన్ బాబు.

Also Read : నా దుడ్లుతో కొనుక్కున్నా.. వైసీపీకి లోకేష్ మార్క్ కౌంటర్..!

ఫోన్ కాల్స్ తో పాటు మెసేజ్ లను విశ్లేషించి ఫోరెన్సిక్ ల్యాబరేటరి నివేదిక అందజేయాల్సిన ఉందని హైకోర్ట్ పేర్కొంది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఎఫ్ ఐ ఆర్ ఆధారంగా తదుపరి చర్యలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని మోహన్ బాబు తరుపు న్యాయవాది చేసిన అభ్యర్దనను హైకోర్ట్ తోసిపుచ్చింది. అదే విధంగా వ్యాజ్యం పై లోతైన విచారణ జరుపుతామని మార్చి 3కి క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్ట్ వాయిదా వేసింది.

Also Read : మరోసారి అడ్డంగా దొరికిపోయిన వైసీపీ..!

విద్యార్థి నాయకుల కిడ్నాప్ కు ముందు, తరువాత కూడా కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న వర్సిటీ పీఆర్వో సతీష్‌ తో పిటిషనర్‌ ఫోన్‌ లో మాట్లాడారని, మెసేజ్‌ లు కూడా చేసుకున్నారని పోలీసులు చెబుతున్నట్లు హైకోర్ట్ పేర్కొంది. అసలు ఈ కేసులో ఏం జరిగిందో ఒకసారి చూస్తే.. మోహన్‌బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీ, అక్రమాలకు పాల్పడుతున్నారని విద్యార్థి సంఘాలు గత కొన్నాళ్ళుగా ఆరోపణలు చేస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే.. యూనివర్సిటీకి వ్యతిరేకంగా కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపేందుకు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్బర్, ఎస్వీయూ విద్యార్థి నాయకుడు వినోద్‌ లను తిరుచానూరు సమీపంలో కిడ్నాప్‌ చేసారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో వేగంగా స్పందించడమే కాకుండా.. కిడ్నాప్ చేసిన దుండగుల వాహనాలను వెంబడించి గంటల వ్యవధిలోనే వారిని కిడ్నాప్ చెర నుంచి విడిపించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మాట నిలబెట్టుకున్న కూటమి...

ఏపీలోని రైతులకు ప్రభుత్వం తీపి కబురు...

ప్రభుత్వ లాయర్ల వైఫల్యమేనా..?...

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్...

నాడు లేవని నోళ్ళు...

గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో...

రేవంత్ క్యాంపు ఆఫీసుల...

తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య పెద్ద...

యూట్యూబర్ రావణ్.. ఇప్పట్లో...

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్...

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు...

ఏపీలో ఖాళీ కానున్న గవర్నర్ కోటా...

పోల్స్