Wednesday, October 7, 2026 09:45 AM
Wednesday, October 7, 2026 09:45 AM

పాపం చేస్తే చివరి రోజే.. ఏపీ మార్క్ న్యాయం..!

ఏపీలో దారుణాలకు పాల్పడిన వారికి అదే చివరి రోజు అంటూ సిఎం చంద్రబాబు పదే పదే చెప్తూ ఉంటారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అది కొన్ని సందర్భాల్లో నిజం అవుతోంది. ఏ రూపంలో అవుతుంది అనేది పక్కన పెడితే.. ఏదోక రూపంలో మాత్రం వారికి చివరి రోజుగా మిగిలిపోతోంది. తాజాగా మదనపల్లెలో ఓ చిన్నారి కనపడకుండా పోయింది. మూడు రోజుల తర్వాత ఎదురుగా ఉన్న ఇంట్లోనే చిన్నారి మృతదేహం పోలీసులు గుర్తించారు. అత్యాచారం చేసి.. హత్య చేసినట్లు తేల్చారు.

Also Read : బ్రేకింగ్: లిక్కర్ కేసులో మాజీ మంత్రి అరెస్ట్..?

ఇక అక్కడి నుంచి ఘటన నిందితుడు కులవర్ధన్ కనపడకుండా పోయాడు. తీరా నేడు ఉదయం అతను ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. కురబాలకోట మండలం కనసానివారిపల్లి చెరువులో పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు దీనిపై హర్షం వ్యక్తమవుతోంది. 2018 నుంచి ఇదే తరహాలో న్యాయం జరుగుతోంది అంటూ ప్రసంశలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడి ఆత్మహత్యలు చేసుకున్నారు పలువురు నిందితులు.

Also Read : దక్షిణ కోస్తా జోన్ కూతకు ముహూర్తం ఖరారు..!

మైలవరం మండలం ఎ.కంబాలదిన్నెలో 3 ఏళ్ల చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన 26 ఏళ్ల రహమతుల్లా మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. కాకినాడ సమీపంలోని తునిలో తాటిక నారాయణ రావు అనే వృద్దుడు ఇలాగే 13 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడి అరెస్టయిన, కోర్టుకు వెళ్ళే క్రమంలో ఓ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2018లో.. 9 ఏళ్ల చిన్నారిని అత్యాచారం చేసిన 50 ఏళ్ల రిక్షా డ్రైవర్ సుబ్బయ్య కూడా ఇలాగే ఆత్మహత్య చేసుకున్నాడు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఏపీలో తాగునీటి విప్లవం.....

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన తాగునీటిని...

ఆంధ్రప్రదేశ్‌లో పాక్ స్పై...

పాకిస్తాన్ తో గూఢచర్య కుట్రను...

భారత క్రికెట్ లో...

భారత మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యంత...

చంద్రబాబు ఢిల్లీ టూర్...

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కేంద్ర...

విజయనగరం టీడీపీలో విచిత్ర...

విజయనగరం జిల్లా రాజకీయాలు ఇప్పుడు అత్యంత...

అమరావతిలో కేటీఆర్ టీమ్‌...

ఒకవైపు అమరావతిని భ్రమరావతి, గ్రాఫిక్స్ రాజధాని...

పోల్స్