Wednesday, July 8, 2026 12:27 AM
Wednesday, July 8, 2026 12:27 AM

ఎలా ఉండే వాడు.. ఎలా అయిపోయాడు..!

తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో జరిగిన మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక తీరు చూశాక రాజకీయాల్లో ఉండాలా, వద్దా అనేది అర్థం కావడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. తొర్రూరులో 16 వార్డులకు 9 బీఆర్ఎస్, 7 కాంగ్రెస్ గెలుచుకున్నాయి. ఎక్స్అఫీషియో ఓట్లతో కలిపి రెండు పార్టీల బలాలు సమానమయ్యాయి. దీంతో లాటరీ తీయడంతో కాంగ్రెస్ రెండో వార్డు కౌన్సిలర్ శ్రావణ్ కుమార్ చైర్మన్ అయ్యారు.

ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో తొర్రూరులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఓ సమయంలో ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు, పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం జరిగిన ఎన్నికలో మున్సిపాలిటిని కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. తొర్రూరు మున్సిపాలిటిని కోల్పోవడంతో ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రేయింబవళ్లు పార్టీ గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పాలని రోదిస్తూ అక్కడున్న పోలీసులను ప్రశ్నించారు. పోలీసుల తీరు సరిగ్గా లేదని ఆరోపించారు. ఇంత అరాచకంగా ఎన్నికలు నిర్వహించడమేమిటని ప్రశ్నించారు. కార్యకర్తలు తెగించి పోరాడారని.. పోలీసులు రాజ్యాంగ విరుద్ధంగా పని చేశారని అసహనం వ్యక్తం చేశారు. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత దగా, మోసం చూడలేదని కన్నీరు పెట్టుకున్నారు. ఎన్నిక అప్రజాస్వామికంగా నిర్వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి చూస్తుంటే రాజకీయాల్లో ఉండాలో, వద్దో కూడా అర్థం కావడం లేదని అన్నారు. తొర్రూరు ప్రజలు తమకు పట్టం కడితే ఈ ప్రభుత్వం అన్యాయంగా మున్సిపాలిటీని దక్కించుకుందని అన్నారు. తనను, తన భార్యను అన్యాయంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొర్రూరులోని తన కార్యాలయానికి కూడా వెళ్లనీయడం లేదని ఆరోపించారు. విప్ జారీ చేయకుండా అన్యాయంగా అరెస్టు చేశారని అన్నారు.

ఎర్రబెల్లి దయాకర్ కన్నీరు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోపై తెలుగు రాష్ట్రాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. కర్మ రిటర్న్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో చక్రం తిప్పిన నేత.. అధినేత చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచిన తర్వాత బీఆర్ఎస్‌లో చేరారని.. అందుకే ఇలా గేటు దగ్గర ఏడుస్తూ మిగిలిపోయారంటున్నారు. మరికొందరేమో.. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్టు వెనుక ఎర్రబెల్లి ఉన్నారని.. అందుకే ఇప్పుడు ఇలా రివెంజ్ తీర్చుకుంటున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి టీడీపీలో ఉన్నప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో చక్రం తిప్పిన ఎర్రబెల్లి.. ఇప్పుడు బీఆర్ఎస్‌లో గేటు దగ్గర నిలబడి ఇలా కన్నీరు పెట్టుకోవటం చూస్తుంటే.. అయ్యో పాపం అంటున్నారు. ఎలా ఉండే వాడు.. ఎలా అయిపోయాడు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మాట నిలబెట్టుకున్న కూటమి...

ఏపీలోని రైతులకు ప్రభుత్వం తీపి కబురు...

ప్రభుత్వ లాయర్ల వైఫల్యమేనా..?...

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్...

నాడు లేవని నోళ్ళు...

గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో...

రేవంత్ క్యాంపు ఆఫీసుల...

తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య పెద్ద...

యూట్యూబర్ రావణ్.. ఇప్పట్లో...

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్...

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు...

ఏపీలో ఖాళీ కానున్న గవర్నర్ కోటా...

పోల్స్