Wednesday, October 7, 2026 08:19 AM
Wednesday, October 7, 2026 08:19 AM

నా దుడ్లుతో కొనుక్కున్నా.. వైసీపీకి లోకేష్ మార్క్ కౌంటర్..!

రాజకీయాల్లో ప్రత్యర్ధులను టార్గెట్ చేయడమనేది సహజమే. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతీ ఒక్కటి అల్లరి చేయడం మనం చూస్తూనే ఉంటాం. తప్పుడు ప్రచారాల వ్యాప్తి కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏపీలో వైసీపీ నుంచి ఈ సంస్కృతి మనం పదే పదే చూస్తూ ఉంటాం. టీడీపీ నేతలను టార్గెట్ చేసే క్రమంలో వారి వ్యక్తిగత జీవితాల వరకు వైసీపీ సోషల్ మీడియా వెళ్లి కామెంట్స్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మంత్రి నారా లోకేష్ విషయంలో వైసీపీ ఇలాగే హడావుడి మొదలుపెట్టింది.

Also Read : వంగా యూనివర్స్.. స్పిరిట్ కు యానిమల్ పార్క్ కు లింక్ అక్కడే..?

రెండు రోజుల క్రితం నారా లోకేష్.. కొలంబో వెళ్లి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చూసారు. ఆ మ్యాచ్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ మరుసటి రోజున.. బిల్ గేట్స్ రాష్ట్రానికి రావడంతో.. లోకేష్ కూడా గన్నవరం వెళ్ళారు. అయితే.. లోకేష్ వెళ్ళడానికి ఫ్లైట్ ఖర్చులు.. మ్యాచ్ టికెట్ ఖర్చులు, హోటల్ ఖర్చులు.. అన్నీ కలిపి కోటి రూపాయలు అయ్యాయని వైసీపీ అనుకూల మీడియా సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో హడావుడి చేసింది.

Also Read : ఏపీ క్యాబినెట్‌లో కొత్త పేరు ఖాయమా..?

గతంలో లోకేష్ చిరు తిండి కోసం పాతిక లక్షలు అయ్యాయని ఇలాగే హడావుడి చేసి.. చేసిన తప్పుడు ప్రచారానికి ఇప్పుడు కోర్ట్ కు తిరుగుతోంది సాక్షి ఛానల్. ఇక ఇప్పుడు శ్రీలంక ట్రిప్ పై లోకేష్ తన సోషల్ మీడియా ఖాతాలో చేసిన పోస్ట్ రాజకీయంగా చర్చనీయాంశం అయింది. ఫ్లైట్ టికెట్టూ నాదే! మ్యాచ్ టికెట్టూ నాదే! నా దుడ్లతో నేను మ్యాచ్ చూస్తిని.. నీ దుడ్లు ఏమైనా ఖర్చు చేస్తినా జగన్..? అంటూ చిత్తూరు యాసలో జగన్ కు లోకేష్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారి స్క్రీన్ షాట్ కూడా జత చేసారు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఏపీలో తాగునీటి విప్లవం.....

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన తాగునీటిని...

ఆంధ్రప్రదేశ్‌లో పాక్ స్పై...

పాకిస్తాన్ తో గూఢచర్య కుట్రను...

భారత క్రికెట్ లో...

భారత మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యంత...

చంద్రబాబు ఢిల్లీ టూర్...

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కేంద్ర...

విజయనగరం టీడీపీలో విచిత్ర...

విజయనగరం జిల్లా రాజకీయాలు ఇప్పుడు అత్యంత...

అమరావతిలో కేటీఆర్ టీమ్‌...

ఒకవైపు అమరావతిని భ్రమరావతి, గ్రాఫిక్స్ రాజధాని...

పోల్స్