పాకిస్తాన్ రాజకీయాల్లో నిత్యం మనకు కనపడే దృశ్యం.. ఆ దేశ అధ్యక్షుడిగా పని చేసిన వారికి జైలు శిక్ష లేదంటే, దేశ బహిష్కరణకు గురి కావడం. బుట్టో నుంచి ముషారఫ్, షరీఫ్ సహా ఎందరో నేతలు ఇలా బహిష్కరణ ఎదుర్కొన్న వారిలో ఉన్నారు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ జైలు పాలయ్యారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళన కూడా మొదలయింది. ఆయన చూపు కూడా కోల్పోయారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయనను చూపించాలంటూ కొన్ని రోజులుగా డిమాండ్ లు కూడా వినపడుతున్నాయి.
Also Read : ఆ సీటు ఎవరికి దక్కుతుంది..?
తాజాగా ఇమ్రాన్ కు భారత్ నుంచి కూడా మద్దతు లభించింది. సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ సహా మాజీ అంతర్జాతీయ క్రికెట్ కెప్టెన్ల బృందం పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరుతూ.. ఒక సంయుక్త ప్రకటన విడుదల చేసింది. ఆ దేశ మాజీ ప్రధాని, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్‌కు తక్షణ, తగిన వైద్య సహాయం అందేలా, కస్టడీలో గౌరవంగా వ్యవహరించేలా చూడాలని కోరింది. ఫిబ్రవరి 17న విడుదల చేసిన ప్రకటనలో.. గత రెండున్నర సంవత్సరాలుగా అతని నిర్బంధ పరిస్థితుల గురించి వచ్చిన వార్తలపై మాజీ కెప్టెన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు.
Also Read : బ్రేకింగ్: ప్రత్యూష కేసులో సుప్రీం సంచలన తీర్పు
సంతకం చేసిన వారిలో మైఖేల్ అథర్టన్, అలన్ బోర్డర్, మైఖేల్ బ్రెయర్లీ, గ్రెగ్ చాపెల్, ఇయాన్ చాపెల్, బెలిండా క్లార్క్, సునీల్ గవాస్కర్, డేవిడ్ గోవర్, కిమ్ హ్యూస్, నాజర్ హుస్సేన్, క్లైవ్ లాయిడ్, కపిల్ దేవ్, స్టీఫెన్ వా మరియు జాన్ రైట్ ఉన్నారు. 1992 క్రికెట్ ప్రపంచ కప్ లో పాకిస్తాన్ జట్టును చారిత్రాత్మక విజయం దిశగా ఎలా నడిపించాడో గుర్తుచేసుకుంటూ, ఇమ్రాన్ ఖాన్ క్రికెట్ కు చేసిన సేవలను ఆ బృందం హైలైట్ చేసింది. సరిహద్దులు దాటి, తరాలకు స్ఫూర్తినిచ్చిన నాయకత్వం, క్రీడా స్ఫూర్తితో సాధించిన విజయంగా వారు ఆ ప్రపంచకప్ రోజులను గుర్తు చేసుకున్నారు.

