Sunday, March 22, 2026 10:14 AM
Sunday, March 22, 2026 10:14 AM

సింఘాల్‌ సరే.. తర్వాత వారి సంగతేంటి..?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారనే విషయం దాదాపు ఖాయమైంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం ఇప్పటికే కోర్టుకు అందించిన నివేదికలో కల్తీ జరిగినట్లు లిఖిత పూర్వకంగా ఇచ్చిన నివేదికలో నెయ్యి లాంటి పదార్థంలో పాలు, పెరుగు అనేవి లేవని, కేవలం కెమికల్స్ ద్వారా తయారు చేశారని స్పష్టంగా ఉంది. దీంతో ఈ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం చేసిన మహా పాపం బయటపడింది. దీంతో చంద్రబాబు, పవన్‌ క్షమాపణ చెప్పాలంటూ కొత్త పాట పాడుతున్నారు. ఇష్యూ డైవర్ట్ చేసేందుకు మరో అడుగు ముందుకు వేసిన వైసీపీ నేతలు.. బూతులతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు.

ఇక సిట్ నివేదిక ప్రకారం.. అప్పుడు టీటీడీ ఈవోగా పని చేసిన అనిల్ కుమార్ సింఘాల్‌పై కూటమి సర్కార్ బదిలీ వేటు వేసింది. ఆయనను వెంటనే జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఇంత వరకు బాగానే ఉంది. మరి సింఘాల్ తర్వాత ఇన్‌ఛార్జ్ ఈవోగా పని చేసిన జవహర్‌ రెడ్డి ని కూటమి సర్కార్ మర్చిపోయిందా..? ఇప్పుడు ఇదే ప్రశ్న సచివాలయ వర్గాలతో పాటు టీటీడీ ఉద్యోగుల్లో కూడా బాగా వినిపిస్తోంది. జవహర్ రెడ్డి ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి. చంద్రబాబు పాలనలో కూడా కీలక స్థానాల్లోనే ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అంతా తానే అయ్యి చక్రం తిప్పారు. జవహర్ రెడ్డి మనిషి మాత్రమే టీడీపీ ప్రభుత్వంలో పని చేసేదని.. మనసు మాత్రం జగన్ చుట్టూ ఉంటుందనే విమర్శలు ఆయన సన్నిహితులు చేశారు.

Also Read : జోగి వెనుక ఉన్నది ఎవరు.. అంత ధైర్యం ఏమిటీ..?

నిజానికి జవహర్‍ రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వటంపై అప్పట్లో లోకేష్ వివరణ ఇచ్చారనేది నాటి ప్రభుత్వ పెద్దల మాట. రెడ్డి సామాజిక వర్గం ఓట్లు కావాలంటే.. జవహర్‌ రెడ్డికి ప్రాధాన్యత పోస్టు ఇవ్వాలనే డిమాండ్ బాగా వినిపించిందని.. అందుకే ఇవ్వాల్సి వచ్చిందని లోకేష్ తన సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానించినట్లు సమాచారం. అదే విధంగా అజయ్ కల్లం రెడ్డిని కూడా. ఆర్ధిక శాఖాధిపతి పోస్టుతో పాటు అత్యంత ప్రాధాన్యత గల రెవెన్యూ శాఖ పరిధిలో ఉండే ఎక్సైజ్, కమర్షియల్, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖలతో పాటు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టులో కూడా అజయ్ కల్లం రెడ్డిని చంద్రబాబు స్వయంగా నియమించారు.

ఇదేంటి సార్.. ఒక ఐఏఎస్ అధికారికి ఇన్ని పోస్టులు ఎందుకు అని.. ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి చంద్రబాబును ప్రశ్నిస్తే.. మాకు రెడ్డి ఓట్లు పడాలంటే.. వారికి మంచి పోస్టులు ఇవ్వటం తప్పని సరి అని వ్యాఖ్యానించారట. అటు జవహర్ రెడ్డికి, ఇటు అజయ్ కల్లం రెడ్డికి ప్రాధాన్యత పోస్టులు ఇచ్చినా కూడా 2019 ఎన్నికల్లో 95 శాతం పైగా రెడ్డి కులం ఓటర్లు జగన్ మోహన్ రెడ్డికే ఓట్లు వేసినట్లు ఆ తరువాతే బయట పడింది. రెడ్డి అధికారులకు ప్రాధాన్యత పోస్టులు ఇస్తే.. రెడ్డి కులం ఓట్లు.. దళిత అధికారులకు మంచి పోస్టులు ఇస్తే.. దళిత ఓట్లు పడతాయని గుడ్డిగా నమ్మిన చంద్రబాబుకు బలమైన షాకులే తగిలాయి.

Also Read : అందరి బ్రతుకు నాకు తెలుసు.. సమావేశంలో రెచ్చిపోయిన పవన్

ఇక ఇప్పుడు కల్తీ నెయ్యి కుంభకోణంలో టీటీడీ ఈవో పోస్టు నుండి సింఘాల్‌ను బదిలీతో కూటమి ప్రభుత్వం చేతులు దులుపుకున్నట్లుగా ఉంది. కానీ.. అప్పట్లో సింఘాల్ తర్వాత ఇంఛార్జ్ ఈవోగా జవహర్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో రిటైర్డు అయ్యారు. జవహర్ రెడ్డిని అటు సిట్ అధికారులు, ఇటు ప్రభుత్వ పెద్దలు కూడా మర్చిపోయినట్లున్నారు. గతంలో.. 2014 నుండి 2019 వరకు టీడీపీ ప్రభుత్వంలో జవహర్ రెడ్డి కీలకమైన పంచాయతీ రాజ్ శాఖాధిపతిగా ఐదేళ్లు బాధ్యతలు నిర్వహించారు. దీని వెనుక చంద్రబాబు ఆశీస్సులతో పాటు అప్పటి మంత్రి లోకేష్ అభయం లేకుండా సాధ్యమా అనే మాట బాగా వినిపిస్తోంది.

గ్రామీణాభివృద్ధి శాఖను కూడా చంద్రబాబు పైన లోకేష్ ఒత్తిడి తెచ్చి ఇప్పించారని అప్పట్లో మీడియాలో కథనాలు వచ్చాయి కూడా. అందుకే ఇప్పుడు జవహర్ రెడ్డి మీద ఈగ కూడా వాలటం లేదనే మాట సచివాలయ వర్గాల్లో బాగా వినిపిస్తోంది. అప్పట్లో కల్తీ నెయ్యి సరఫరా జరుగుతుందని ఇంఛార్జ్ ఈవోగా ఉన్న జవహర్ రెడ్డికి తెలియకుండా ఉంటుందా..? తిరుమలలోనే ఉన్న జవహర్ రెడ్డి.. స్వామి వారి దర్శించుకున్న దర్వాత లడ్డూ ప్రసాదం తినే ఉంటారు కదా. అలాగే లడ్డూ నాణ్యతపై ఫిర్యాదులు వచ్చాయి కదా. లడ్డూ తిన్నప్పుడు జవహర్ రెడ్డికి రుచి తెలియలేదా..? జవహర్ రెడ్డికి ఎలాంటి అనుమానం కలగ లేదా.. ?. ఏది ఏమైనా టీటీడీ మాజీ ఇంఛార్జ్ ఈవో, రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి విషయంలో అటు సిట్ అధికారులు సరైన రీతిలో విచారించాల్సి ఉన్నా కూడా ఏ మాత్రం పట్టించుకోవటం లేదు అనే మాట బాగా వినిపిస్తోంది. సీఎం చంద్రబాబు కూడా జవహర్ రెడ్డి పై దృష్టి పెట్టలేదన్నది వాస్తవం అని సీనియర్ ఐఏఎస్ అధికారులు చెబుతున్న మాట. మరి చంద్రబాబు ఇప్పటికైనా ఆ దిశగా చర్యలు తీసుకుంటారా..?

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్