Wednesday, August 5, 2026 04:35 PM
Wednesday, August 5, 2026 04:35 PM

తలోదారి అయిపోయిన టీడీపీ సోషల్ మీడియా క్యాడర్..!

రాజకీయాల్లో.. కొన్ని పార్టీల కార్యకర్తలను చూసినప్పుడు కాస్త ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అందులో వైసీపీ, బీఆర్ఎస్, బిజెపి వంటి పార్టీల కార్యకర్తలు.. ఒకరు ఒక విషయాన్ని ప్రచారం చేయాలన్నా, ఎదురుదాడి చేయాలన్నా సరే ఒక స్పష్టమైన క్లారిటీతో ఉంటారు అనే మాట వాస్తవం. కానీ ఈ విషయంలో టీడీపీ కార్యకర్తలు మాత్రం ముందు నుంచి ఫెయిల్ అవుతూనే ఉంటారనే మాట అక్షర సత్యం. ఇప్పుడు వైసీపీ నేతల బూతుల విషయంలో సోషల్ మీడియాలో పెద్ద యుద్దమే జరుగుతోంది.

Also Read : బరితెగింపు వెనుక జగన్ ఆశీస్సులు..!

అంబటి రాంబాబు బూతులు.. జోగి రమేష్ కొవ్వు మాటల తర్వాత వాతావరణం వేడెక్కింది. ఇద్దరి ఇళ్ళపై దాడులు జరిగాయి. ఈ విషయంలో కొందరు టీడీపీ కార్యకర్తలను అభినందించారు. కానీ మరికొందరు కార్యకర్తలు మాత్రం.. అలా చేస్తే వాళ్లకు మనకూ తేడా ఏంటీ అంటూ మాట్లాడారు. ఇంకొందరు కాపుల్లో, గౌడ సామాజిక వర్గంలో వ్యతిరేకత వస్తుందని అభిప్రాయాలు చెప్పడం మొదలుపెట్టారు. ఇంకొందరు ఇంకో అడుగు ముందుకేసి.. టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడం తప్పు అని చంద్రబాబును లోకేష్ ను తిట్టడం మొదలుపెట్టారు.

Also Read : నకిలీ వివిఐపి పాసులు.. వెనకున్నది టిడిపి వారేనా..?

మరికొందరు అయితే.. ఇది చంద్రబాబు టీడీపీ కాదని, లోకేష్ టీడీపీ అని.. దాడులతో జగన్ మనస్తత్వం లోకేష్ చూపిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇలా ఎవరికి నచ్చిన అభిప్రాయం వారు చెప్తూ.. వైసీపీ చేస్తున్న ఎదురుదాడిని తిప్పికొట్టడం లో ఫెయిల్ అయ్యారు. ఓ పక్క వైసీపీ బూతులను కవర్ చేసి.. కులాలను తెచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. టీడీపీ మాత్రం భిన్నాభిప్రాయాలతో రాజకీయం చేస్తోంది. ఇదే కొనసాగితే భవిష్యత్తులో వైసీపీ సోషల్ మీడియా మరింత పుంజుకునే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

జంతర్ మంతర్ నిరసనల్లో...

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్...

బీసీలకు ఏపీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతుల సామాజికవర్గాల భద్రత,...

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

పోల్స్