Sunday, September 20, 2026 12:50 AM
Sunday, September 20, 2026 12:50 AM

అందరి బ్రతుకు నాకు తెలుసు.. సమావేశంలో రెచ్చిపోయిన పవన్

గతవారం పది రోజుల నుంచి ఏపీలో ఏదో జరిగినా సంచలనంగానే ఉంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం, ఆ తర్వాత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు.. ఆ తర్వాత మాజీ మంత్రి జోగి రమేష్ మంత్రి నారా లోకేష్ పై, సీఎం చంద్రబాబు పై చేసిన విమర్శలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. వాళ్ళిద్దరూ చేసిన వ్యాఖ్యలతో రెచ్చిపోయిన టిడిపి కార్యకర్తలు వారి ఇళ్ల పై దాడులకు దిగారు. దీనితో అరవ శ్రీధర్ వ్యవహారం ఒక్కసారిగా మరుగున పడింది. ప్రస్తుతం శ్రీధర్ అలాగే ఆయనపై ఆరోపణలు చేసిన వీణ అజ్ఞాతంలో ఉన్నారు. దీనిపై హడావుడి చేసిన వైసీపీ సోషల్ మీడియా అలాగే వైసిపి ఎలక్ట్రానిక్ మీడియా కూడా సైలెంట్ అయిపోయింది.

Also Read : వైసీపీ ట్రాప్ లో పడొద్దు.. క్యాడర్ కి బాబు దిశానిర్దేశం

అయితే ఈ అంశంలో జనసేన పార్టీ విచారణకు కూడా ఆదేశాలు ఇచ్చింది. విచారణ కమిటీ ఇప్పటికే విచారణ కొనసాగిస్తుంది. విచారణ పూర్తయ్యే వరకు ఎమ్మెల్యే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని పవన్ కళ్యాణ్ స్పష్టంగా వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాడుల వ్యవహారమే చర్చకు వస్తోంది. ఇక తాజాగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలతో ఇతర పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. వైసిపి చేస్తున్న విమర్శలను ఏ విధంగా తిప్పి కొట్టాలి అనేదానిపై పవన్ కళ్యాణ్ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అరవ శ్రీధర్ వ్యవహారం కూడా చర్చకు వచ్చింది.

Also Read : టాలీవుడ్ ఫ్యాన్స్ కు కామన్ సెన్స్ మిస్ అవుతుందా..?

ఎమ్మెల్యే పై వస్తున్న ఆరోపణలు, వైసీపీ సోషల్ మీడియాతో పాటుగా ఎలక్ట్రానిక్ మీడియా చేస్తున్న హడావుడి కూడా ఈ సందర్భంగా అక్కడున్న నేతలు ప్రస్తావించారు. దీనితో ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయిన పవన్ కళ్యాణ్ ఏం జరుగుతుందో తనకు తెలుసని.. అందరు చిట్టా తన వద్ద ఉందని చెప్తూ అక్కడినుంచి లేచి వెళ్ళిపోయారు. సాధారణంగా పవన్ కళ్యాణ్ శాంతంగా ఉంటారనే కామెంట్ వింటూనే ఉంటాం. ఈ పరిణామంతో ఒక్కసారిగా అక్కడున్న నేతలు కూడా షాక్ అయ్యారు. ఎవరితో మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ వెళ్లిపోవడంతో.. అక్కడున్న మీడియా ప్రతినిధులు కూడా కంగుతిన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్