Wednesday, August 5, 2026 03:30 PM
Wednesday, August 5, 2026 03:30 PM

టాలీవుడ్ ఫ్యాన్స్ కు కామన్ సెన్స్ మిస్ అవుతుందా..?

మనదేశంలో సినిమా వాళ్ళపై ఉన్న ప్రేమ కుటుంబ సభ్యులపై కూడా ఉండదు. సినిమా హీరోలను దేవుళ్ళుగా కొలుస్తూ వాళ్ళ పేర్లను తమ పిల్లలకు కూడా పెట్టుకునే సంస్కృతి మనదేశంలో ఉంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో హీరోలను ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. సినిమా వాళ్ళతో ఫోటోలు దిగటానికి, వాళ్లను చూడటానికి చేసే హడావుడి అంతా ఇంతా కాదు. హీరోయిన్లయినా హీరో లైనా.. ఎవరైనా సరే కనపడితే చాలు మీద పడిపోవడం ఇప్పుడు ప్యాషన్ గా మారింది. ఇటీవల కాలంలో హీరోయిన్లు భద్రత పెంచుకుని ఈవెంట్ లకు హాజరవుతున్న సరే హీరోయిన్ల మీద పడిపోతున్నారు అభిమానులు.

Also read : అప్పుడు అత్యాశ పడ్డారు.. ఇప్పుడు బోల్తా పడ్డారు..!

తాజాగా మెగా హీరో రామ్ చరణ్ విషయంలో కూడా ఇదే జరిగింది. రామ్ చరణ్ కు ఇటీవల కవల పిల్లలు పుట్టారు. కొడుకు కూతురు పుట్టడంతో రామ్ చరణ్ తన మొదటి కూతురును ఎత్తుకుని తన భార్య ఉన్న ఆసుపత్రికి వచ్చారు. ఆ సమయంలో అక్కడ గుమిగూడిన అభిమానులు.. రామ్ చరణ్ ఆసుపత్రిలోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ భద్రత సిబ్బంది ఎంత ఆపే ప్రయత్నం చేస్తున్నా సరే అభిమానులు మాత్రం ఆగలేదు. ఒక సందర్భంలో రాంచరణ్ చొక్కా కూడా చిరిగిపోయే పరిస్థితి వచ్చింది. వ్యక్తిగత విషయాల్లో కూడా అభిమానులు ఇలా అత్యుత్సాహం ప్రదర్శించడంతో హీరోలు ఇబ్బంది పడుతున్నారు.

Also read : వైసీపీ ట్రాప్ లో పడొద్దు.. క్యాడర్ కి బాబు దిశానిర్దేశం

కేరళ వంటి రాష్ట్రంలో కొంత ఇటువంటి పరిస్థితి కనపడదు. తమిళనాడు, కర్ణాటకలో కూడా ఇది కొంత తక్కువే. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇది మితిమీరి పోయింది. ఫోటోల పిచ్చితో కొందరు అభిమానులు చేస్తున్న విపరీత చేష్టల కారణంగా.. హీరోల పర్సనల్ లైఫ్ కూడా దెబ్బతింటుంది. అటు క్రికెటర్లు కూడా ఈ విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. అందుకే విరాట్ కోహ్లీ భారత్ లో ఉండటానికి ఇష్టపడటం లేదు అనే కామెంట్స్ కూడా వచ్చాయి. రోహిత్ శర్మ కూడా ఇలాగే ఇబ్బంది పడుతూ లండన్ లో ఎక్కువగా ఉంటున్నాడు. అభిమానుల ఆలోచన విధానం మారకపోతే.. హీరోల ప్రాణాలు కూడా రక్షణ ఉండదు అనేది పరిశీలకుల ఆవేదన.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

జంతర్ మంతర్ నిరసనల్లో...

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్...

బీసీలకు ఏపీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతుల సామాజికవర్గాల భద్రత,...

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

పోల్స్